Veekshanam Movie: థియేటర్స్‌లో దూసుకుపోతున్న వీక్షణం.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్

Veekshanam Movie Success Meet: వీక్షణం మూవీ థియేటర్స్‌లో దూసుకుపోతుందని చిత్రబృందం తెలిపింది. ఈ నేపథ్యంలోనే సక్సెస్ మీట్‌ను నిర్వహించి ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోందని.. అందరికీ థ్యాంక్స్ చెప్పింది.    

Written by - Ashok Krindinti | Last Updated : Oct 21, 2024, 10:56 AM IST
Veekshanam Movie: థియేటర్స్‌లో దూసుకుపోతున్న వీక్షణం.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్

Veekshanam Movie Success Meet: రామ్ కార్తీక్, కశ్వి హీరో, హీరోయిన్‌లుగా మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వీక్షణం. ఈ నెల 18న ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో చాలా హ్యాపీగా ఉందని అన్నారు. సక్సెస్ అవుతుందని ఊహించనని.. కానీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని.. భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు.

Also Read: Balakrishna Nominated Padma Bhushan: నందమూరి బాలకృష్ణని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. వీక్షణ మూవీని ఆదరించిన ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మూవీకి చాలా మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయని.. థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. వీక్షణం మూవీకి చాలా మంచి రివ్యూలు రావాడం హ్యాపీగా ఉందన్నారు. సిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. యాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇది తన ఫస్ట్ మూవీ అని.. తొలి సినిమాకే ఇంతమంది ప్రేమ దొరకడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఈ పాత్రకు సెలెక్ట్ చేసిన డైరెక్టర్ మనోజ్‌కు రుణపడి ఉంటానని అన్నారు. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదని.. మూవీ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ముందు నుంచి చాలా సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనను ఈ పాత్రకు తీసుకున్నందుకు డైరెక్టర్ మనోజ్‌కి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. ఆయన తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నానని చెప్పారు. ఈ మూవీ కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని.. ఫణితో కలిసి పోటీ పడి నటించానని అన్నారు. ఇది తన మొదటి సినిమా అయినా.. హీరో కార్తీక్ చాలా సపోర్ట్ చేశారన్నారు. ఫణి మాట్లాడుతూ.. ముందుగా డైరెక్టర్ మనోజ్‌కు థ్యాంక్స్ అని చెప్పారు. ప్రొడ్యూసర్ అశోక్ చిన్న సినిమా అయినా.. ఎక్కడా బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా నిర్మించారని చెప్పారు. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News