Vitamin D Deficiency: శరీరంలో విటమిన్ డి లోపముంటే ఏం జరుగుతుంది, బెస్ట్ ఫుడ్స్ ఏంటి

Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాల్లో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి లోపిస్తే శరీరంలో పలు సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 4, 2024, 06:11 PM IST
Vitamin D Deficiency: శరీరంలో విటమిన్ డి లోపముంటే ఏం జరుగుతుంది, బెస్ట్ ఫుడ్స్ ఏంటి

Vitamin D Deficiency: విటమిన్ డి అనేది శరీరానికి చాలా అవసరం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో వివిధ పదార్ధాల ద్వారా సంక్రమించే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ సంగ్రహణకు విటమిన్ డి దోహదం చేస్తుంది. అంటే విటమిన్ డి లేకుంటే ఇతర విటమిన్ల లోపం కూడా తలెత్తవచ్చు. విటమిన్ డి అనేది సహజసిద్ధంగా సూర్యరశ్మి ద్వారా లభించే కీలకమైన విటమిన్. 

విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా పిల్లలు, వృద్ధుల్లో తలెత్తుతుంది. అంతేకాకుండా కిడ్నీ, లివర్ వ్యాధులు, డార్క్ స్కిన్, సిస్టిక్ ఫైబ్రోసిస్, సీలియెక్ రోగుల్లో ఎక్కువగా కన్పిస్తుంది. విటమిన్ డి సూర్యరశ్మిలో అత్యధికంగా లభిస్తుంది. రోజూ ఉదయం వేళ కాస్సేపు ఎండలో నిలుచుంటే చాలు. కావల్సినంత విటమిన్ డి లభిస్తుంది. లేదా పాల ఉత్పత్తులు, చేపల్లో లభిస్తుంది. విటమిన్ డి లోపముంటే కండరాల్లో నొప్పి, బలహీనత స్పష్టంగా కన్పిస్తుంది. ఎముకల్లో నొప్పి ఉంటుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. ఉదాసీనత, మెట్లెక్కేటప్పుడు ఇబ్బందులు తలెత్తడం, సరిగ్గా నడవలేకపోవడం గమనించవచ్చు. విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉండాలంటే గుడ్లు బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. 2 గుడ్లు తీసుకుంటే 8.2 మైక్రో గ్రాముల విటమిన్ డి ఉంటుంది. ఇది కావల్సిన మోతాదులో 82 శాతం. అయితే మీరు శాకాహారులైతే మాత్రం ఇంకా కొన్ని ఇతర ఆహార పదార్ధాలున్నాయి. 

ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు కానీ ఇందులో విటమిన్ డి కూడా కావల్సినంత ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల విటమిన్ డితో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక బ్రోకలీ మరో బెస్ట్ ఫుడ్. ఇందులో విటమిన్ డితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. విటమిన్ డి పుష్కలంగా లభించే శాకాహార పదార్ధాల్లో బెస్ట్ అంటే మష్రూం. సూర్యరశ్మిలో పండించే మష్రూం చాలా మంచిది. 

ఇక ఆకు కూరల్లో పాలకూర విటమిన్ డికు బెస్ట్ సోర్స్. ఇందులో విటమిన్ డి పెద్దఎత్తున ఉంటుంది. దాంతోపాటు ఐరన్, కాల్షియం కూడా లభిస్తాయి. పాలకూరను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. కేల అనేది అద్భుతమైన సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్ డి పెద్దఎత్తున ఉంటుంది. దాంతోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి సైతం ఇది చాలా మేలు చేస్తుంది. 

Also read: AP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలు, ఇలా https://aptet.apcfss.in చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News