Trump 2.0: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం అనేది.. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల మధ్య బలమైన బంధం కొనసాగే దిశగా మార్గం సుగమం అయింది. నిజానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహరిస్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. అయినప్పటికీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వైపే భారతీయ అమెరికన్లు మొగ్గుచూపినట్లు, ఎన్నికల ఫలితాల ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది. అయితే భారతీయ అమెరికాను అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో మాత్రం కమలహరిస్ హస్తగతం చేసుకోవడం గమనార్హం. అంటే ఇప్పటికీ కూడా మెజారిటీ ఇమిగ్రెంట్లు డెమొక్రటిక్ పార్టీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ, వర్జీనియా, వాషింగ్టన్, బేఏరియాలోని రాష్ట్రాల్లో కమల హారిస్ సత్తా చాటారు. అయితే స్వింగ్ స్టేట్లో మొగ్గు చూపడంతో మాత్రమే ట్రంప్ అధికారం హస్తగతం చేసుకున్నట్లు, వార్తలు వస్తున్నాయి.
భారత్ తో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బంధం:
ఇదిలా ఉంటే ఏషియన్ అమెరికన్లలో భారత మూలాలు కలిగిన ఉన్న అమెరికన్లను ఆకట్టుకోవడంలో ట్రంప్ క్యాంపెయిన్ విజయం సాధించిందని, పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి పలు సర్వేల్లో కమలహరిస్ ముందంజలో నిలిచారు. కానీ అనూహ్యంగా ట్రంప్ చివరిలో బలపడ్డాడు. అయితే భారతీయ అమెరికన్లతో ట్రంప్ మొదటి నుంచి కూడా వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన గతంలో భారత్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో కలిసి ఆయన నమస్తే ట్రంప్ అనే కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు. అప్పటినుంచి ట్రంప్ కు భారత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భారతీయ అమెరికన్లు భావిస్తున్నారు.
Read Also : Reliance Jio IPO: అతి త్వరలో రిలయన్స్ జియో ఐపీవో..దేశంలోని అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్ధం అవుతోందా..?
ముఖ్యంగా భారత్ అమెరికా వాణిజ్య బంధానికి ట్రంప్ తోడ్పడతారని భావిస్తున్నారు. గతంలో అమెరికాతో పలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కూడా ట్రంప్ సర్కార్ చొరవ చూపించింది. ముఖ్యంగా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ను ప్రోత్సహించేందుకు ట్రంప్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అటు ఇమిగ్రేంట్స్ విషయంలో ట్రంప్ సర్కార్ కఠినంగా ఉండే, అవకాశం కనిపిస్తోందని మరికొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన చరిత్ర గతంలో ఉంది. దీంతో అటు విద్యార్థులు, ఉద్యోగులకు వీసా నిబంధనలు కఠిన తరం అవుతాయని భావిస్తున్నారు. అయితే ఈసారి ట్రంప్ సర్కార్ భారత్ పట్ల కాస్త ఉదార వైఖరి అవలంబించే అవకాశం ఉందని, ఎన్నికల హామీల్లో తెలిపినట్లు తెలుస్తోంది.
ట్రంప్ వాణిజ్యం విషయంలో తరతమ బేధాలు పాటించరు. తమ వాణిజ్యం కోసం అవసరం అయితే ఉత్తర కొరియాతో సైతం జతకట్టేందుకు ఆయన సిద్ధంగా ఉంటారని సంగతి గతంలో ట్రంప్, ఉత్తర కొరియా సుప్రీం కిమ్ మధ్య జరిగిన భేటీని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ట్రంప్ 2.0 పాలన ఎలా ఉంటుందో ముందు ముందు వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.