న్యూ ఢిల్లీ : వెనుకబడిన తరగతుల (ఓబిసి)లకు 27% రిజర్వేషన్ల పరిస్థితిపై అధ్యయనం చేసే కమిటీ పదవీకాలం ఎనిమిదవ సారి కేంద్ర మంత్రివర్గం పొడిగించబడింది. దీనిపై స్పష్టతలేమి, పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకపోవడంతో వివిద సాంకేతిక లోపాల కారణంగా జాప్యమవుతోందని తెలిపారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ లబ్దిదారులను అధ్యయనం చేయడానికి ఈ కమిటీని అక్టోబర్ 2017లో ఏర్పాటు చేశారు.
స్పష్టమైన కుల గణన చేయలేనప్పుడు ఓబీసీ రిజర్వేషన్ అమలు ప్రక్రియ సాధ్యంకాదన్నారు. సామజిక ఆర్ధిక పరమైన అంశాలు వంటి డేటా లేకుండా రిజర్వేషన్లను రీ ఆర్గనైజ్ చేయడం ఆమోదయోగ్యం కాదని పలువురు రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. అంతేకాకుండా 2011 జనాభా లెక్కలతో పాటు సేకరించిన సామాజిక, ఆర్థిక కులగణన వంటి డేటా ఇంకా విడుదల చేయలేదన్నారు.
కేబినెట్ 8వ సారి పొడిగింపుపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవాడేకర్ మాట్లాడుతూ ఈ జాబితాలు బ్రిటిష్ కాలంలో తయారు చేయబడ్డాయని, వ్యత్యాసాలను, పొడిగింపు వెనుక గల కారణాలను వివరించారు. ఒకే కులానికి సంబందించిన డేటా ఒక రాష్ట్రంలో ఒక విదంగా, అదే కులం మరో రాష్ట్రంలో వేరే విధంగా ఉన్న తరుణంలో జాప్యానికి కారణంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
ముసాయిదా నివేదిక ప్రకారం, రిజర్వేషన్ల నుండి నాల్గవ వంతు ప్రయోజనాలు 10 ప్రత్యేక ఓబిసి గ్రూపులకు మాత్రమే వెళుతున్నాయని, మిగతా కులాలు వెనుకబాటుకు గురవుతున్నారని అందరికీ ప్రయోజనం జరిగే విదంగా జస్టిస్ రోహిణి నేతృత్వంలోని నలుగురు కమిషన్ సభ్యుల బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..