Raghu Rama Krishna Raju: ఎంత వేధింపులకు గురిచేసి.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కర్మఫలం సిద్ధించి అతడికే అలాంటి గతి పట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్‌ను ప్రతిపక్షంలో.. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడం దేవుడు రాసిన స్క్రిప్ట్‌గా అభివర్ణించారు. ప్రతిపక్షహోదా ఇవ్వాలని కోరుకుంటున్న జగన్‌కు ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలని పేర్కొన్నారు.
Also Read: YS Jagan: చంద్రబాబుకు దమ్ముంటే నన్ను ఎమ్మెల్యేగా తొలగించాలి: వైఎస్ జగన్
అమరావతిలోని అసెంబ్లీలో గురువారం డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'కూటమికి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని చెప్పిన జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. 11 మంది ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు. ప్రతిపక్షహోదా నాయకులు ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలి' అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హోదాలను ఎవరూ శాసించలేరని స్పష్టం చేశారు.
Also Read: YS Sharmila: ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ వచ్చే 108 అంబులెన్స్ మూగబోయింది
రఘురామకృష్ణరాజుపై స్పందిస్తూ.. 'రఘురామను అప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్లు.. ఇప్పుడు సభకు రాలేని పరిస్థితి వచ్చింది. ఇది జగన్‌కు దేవుడు రాసిన స్క్రిప్ట్' అని సీఎం చంద్రబాబు వివరించారు. 'గత ప్రభుత్వంలో అసెంబ్లీని కౌరవసభగా మార్చారు. అప్పుడు అసెంబ్లీలో చెప్పి గౌరవసభ అయ్యాకే వస్తానని శపథం చేశా. శపథం నెరవేర్చుకుని అసెంబ్లీకి వచ్చా' అని వివరించారు. 'జగన్ అవమానించిన వ్యక్తి స్పీకర్ అయ్యారు. జగన్ ఎవరినైతే చంపాలనుకున్నారో.. ఆ వ్యక్తి ఇప్పుడు ఉప సభాపతి అయ్యారు' అని చంద్రబాబు వెల్లడించారు.
'జగన్ రఘురామకృష్ణరాజు జైల్లో చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఎంపీగా పనిచేసిన రఘురామను ఐదేళ్లలో రఘురామను నియోజకవర్గానికి రానివ్వకపోతే రచ్చబండతో ప్రజలకు చేరువయ్యారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని ఏపీకి రానీయని వాళ్లు నేడు మీ ముందు సభలోకి రాలేని.. కూర్చోలేని పరిస్థితి వచ్చింది' అని సీఎం చంద్రబాబు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి