TTD: తిరుమల తిరుపతి పాలక మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు పాలనలో పారదర్శకతకు పెద్ద పీఠ వేసేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పీఠాధిపతులతో సమావేశమై భక్తుల సౌకర్యార్ధం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
టీటీడీ (తిరుమల తిరుమతి దేవస్థానం)లో కొత్తగా కొలువైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన తిరుమలలో సమావేశమైన బోర్డు సభ్యులు కొన్ని అంశాల అమల్లోకి తీసుకు రాబోతున్నారు.
ఇక పై తిరుమలలో వేంకటేశ్వర స్వామి పై సంకీర్తనలే తప్ప.. రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. గతంలో ఈ రూల్ ఉన్న ఇకపై స్ట్రిక్ట్ గా అమలు చేయనున్నారు.
అంతేకాదు తిరుమలలో నిర్మించే అతిథి గృహాలకు ఇకపై సొంత పేర్లు పెట్టొద్దనే నిర్ణయం తీసుకున్నారు. కొంత మంది తమ వ్యక్తిగతమైన పేర్లను పెడుతున్నారు. ఇకపై తిరుమలలో అతిథి గృహాలకు స్వామి వారి పేర్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పెడితే.. వాటిని తెలిగించి శ్రీవారికి సంబంధించిన పేర్లను పెట్టనున్నారు.
కాలి నడకతో పాటు తిరుమల గురించి ఎలాంటి అవగాహన లేకుండా వచ్చే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులకు సులభంగా సర్వదర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాదు భక్తులకు 2, 3 గంటల్లో దర్శనం అయ్యేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు.
తిరుమలలో విశాఖ శారదాపీఠంకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమి లీజు రద్దుకు నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని TTD నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదా పీఠంపై టీటీడీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రేరేపితంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా లేడనే సాకుతో విశాఖ పీఠంపై కన్నెర్ర చేయడం పై భక్తులు మండిపడుతున్నారు.
ఇక భక్తులకు టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టనున్నారు. ఎంతో కాలంగా హిందూ సంఘాలు కోరుకుంటున్న ఈ డిమాండ్ పై టీటీడీ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం చేస్తున్నారు. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.