Fastest Growing City In India : ఆ విషయంలో హైదరాబాదే నెంబర్ వన్..ముంబై, ఢిల్లీని పక్కకు నెట్టేసి అగ్రస్థానంలో నిలిచిన భాగ్యనగరం

Fastest Growing City In India : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి. ఈ రిపోర్టును నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ప్రైమ్ సిటీ సూచీ వెల్లడించింది.  

Written by - Bhoomi | Last Updated : Nov 20, 2024, 03:07 PM IST
Fastest Growing City In India :  ఆ విషయంలో హైదరాబాదే నెంబర్ వన్..ముంబై, ఢిల్లీని పక్కకు నెట్టేసి అగ్రస్థానంలో నిలిచిన  భాగ్యనగరం

Fastest Growing City In India : దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా..బెంగళూరు రెండో స్థానంలో నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ సూచీ రిపోర్టు వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై ఉన్నాయని రిపోర్టు తెలిపింది. 

మౌలిక సదుపాయాలు స్థిరాస్థి రంగం విస్తరణ, ప్రభుత్వ విధానాలు-పరిపాలన, జనాభా పెరుగుదల వంటి అంశాల ప్రాతిపదికన ఆయా నగరాలు విస్తురిస్తున్న తీరును ఈ రిపోర్టు విశ్లేషించింది. ఈ ఆరు ప్రధాన నగరాలు వేగంగా విస్తరిస్తూ దేశ సత్వర ఆర్థికాభివ్రుద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. 

స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ అగ్రస్థానం : 

హైదరాబాద్ లో గత దశాబ్ద కాలంలో నివాస స్థిరాస్తి రంగం వందశాతం చొప్పున వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు రిపోర్టులో పేర్కొంది. 2023లో 11శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. పెట్టుబడిదారులు, వినియోగదారులు కూడా ఇక్కడ స్థిరాస్తులను సొంతం చేసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. రవాణా సదుపాయాలు బహుముఖంగా విస్తరించడం హైదరాబాద్ నగర విస్తరణకు స్థిరాస్థి రంగ వ్రుద్ధికి దోహదపడుతున్నట్లు తెలిపింది. 

వాణిజ్య ఆస్తుల్లో బెంగళూరు :

వాణిజ్య ఆస్తులకు గిరాకీ బెంగళూరులో అధికంగా ఉన్నట్లు ఈ రిపోర్టులో తెలిపింది. బెంగళూరులో దేశ, విదేశీ సంస్థలెన్నో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఉద్యోగాల సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంది. నిరుద్యోగం తక్కువగా ఉంది. విదేశీ పెట్టుబడులను బెంగళూరు నగరం అధికంగా ఆకర్షిస్తోందని పేర్కొంది. అందువల్ల స్థిరాస్తి రంగం బెంగళూరు అభివ్రుద్ధికి చోదక శక్తిగా మారినట్లు ఈ నివేదిక విశ్లేషించింది.

Read more: Viral Video: అమ్మాయికి మెస్సెజ్ చేశాడని దారుణం.. యువకుల పాశావిక దాడి.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News