Lemon Tea Side Effects: లెమన్ టీలో కొన్ని ఆహార పదార్థాలను కలపడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇతర ఆహార పదార్థాలతో కలిపినప్పుడు కొన్ని రకాల రసాయన చర్యలు జరిగి, జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. అయితే లెమన్ టీని ఎలాంటి ఆహారపదార్థాలతో కలపకూడదు అనేది తెలుసుకుందాం.
లెమన్ టీతో కలపకూడని ఆహార పదార్థాలు:
లెమన్ టీ ని పాలు లేదా పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల నిమ్మకాయలోని యాసిడ్ పాలు ప్రోటీన్‌ను గడ్డకట్టిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది లెమన్ టీ తాగడిన తరువాత స్పైసీ ఫూడ్స్‌లను తింటారు. దీని వల్ల కడుపు సమస్యలు కలుగుతాయి. కాబట్టి లెమన్ టీ తాగిన తరువాత స్పైసీ ఫూడ్స్ తినడం మంచిది కాదు. అలాగే రెడ్ వైన్ కూడా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నిమ్మలోని కొన్ని రసాయినాలు వైన్‌తో కలవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. లెమన్ టీ తాగిన తరువాత మజ్జిగ లేదా పెరుగు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. వీటితో పాటు సీఫుడ్ కూడా తినకూడదు. ఇందులో ఉండే యాసిడ్ నేచర్ చర్మ సమస్యలను కలిస్తుంది. కాబట్టి వీటిని కలిపి తినకూడదు. అరటి, మామిడి వంటి తీపి పండ్లను నిమ్మకాయతో కలిపితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
లెమన్ టీ తాగేటప్పుడు జాగ్రత్తలు:
లెమన్ టీ తాగే ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్లపుడు లెమన్ టీ తాగే ముందు ఏదైనా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో తాగడం వల్ల అసిడిటీ పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. లెమన్ టీని తాగిన వెంటనే నీరు తాగడం మంచిది లేదంటే దంతాల ఎనామెల్‌కు హాని కలుగుతుంది. కాబట్టి నీరు తాగడం చాలా మంచిది. కడుపులో ఇప్పటికే అల్సర్ లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయను తీసుకోవడం మంచిది కాదు. నిమ్మకాయ అలర్జీ ఉన్నవారు దీనిని తీసుకోకూడదు. లెమన్ టీని మితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, నిమ్మకాయను తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన విషయం:
ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, తప్పకుండా వైద్యునిని సంప్రదించండి.
ఇదీ చదవండి: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter