Allu Arjun: జూనియర్ ఎన్టీఆర్ లాగా సైలెంట్ కాదు.. అల్లు అర్జున్ కొంచెం వైలెంటే

Allu Arjun vs Mega Family : ప్రస్తుతం అల్లు అర్జున్ వైఖరి చూస్తుంటే.. మెగా, అల్లు అభిమానుల మధ్య.. రచ్చ మరింత పెద్దది అయ్యేలా కనిపిస్తోంది. పుష్ప సినిమాతో.. మెగా అభిమానుల్లో మరింత కోపం నింపారు అల్లు అర్జున్. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్.. అలానే ఈ చిత్రం ఈవెంట్స్ లో అల్లు అర్జున్ తీరు.. ఇవన్నీ చూస్తే.. చిన్నపిల్లలకి కూడా.. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి..యాంటీ అయ్యారు అన్న విషయం అర్థమైపోతుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 5, 2024, 09:19 AM IST
Allu Arjun: జూనియర్ ఎన్టీఆర్ లాగా సైలెంట్ కాదు.. అల్లు అర్జున్ కొంచెం వైలెంటే

Allu Arjun vs Pawan Kalyan : జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా పరంగా కూడా వీరిద్దరూ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. వీరిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీకి చందగా.. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరో అంటూ.. మొదట్లో అందరూ జేజేలు పలికిన సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ కూడా.. వారి వారి ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి పూర్తిగా బయటపడదానికే చూస్తున్నారు. 

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి.. నందమూరి ఫ్యామిలీలో టాప్ హీరో అయిన బాలకృష్ణకి.. ఎన్నో రోజుల నుంచి రిలేషన్షిప్ బాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. బయట ఎక్కడన్నా కనిపించినా.. వీరిద్దరు పలకరించుకోరు. ఇక ఈ మధ్య నందమూరి వారసులు ఎవరు అని అడిగితే.. బాలకృష్ణ తన కొడుకు.. తన మనవడు..ఇంకెవరున్నారు అని అనడంతో.. పూర్తిగా ఎన్టీఆర్ కి బాలకృష్ణకి చేడింది అనే వార్త పై పక్కా క్లారిటీ వచ్చింది. చంద్రబాబు జైలుకెళ్ళినప్పుడు కూడా.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం బాలకృష్ణ కి ఎంతో కోపం తెప్పించింది అనే రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పెద్దగా ఫ్యామిలీ గురించి ఏమీ మాట్లాడారు. వాళ్లని తిట్టరు.. అలా అని వాళ్ల పేర్లు చెప్పుకోరు.  తన సినిమాలు తాను చేసుకుంటూ.. తాను నందమూరి ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాను అని తెలిసేతట్టు.. ముందుకు వెళుతూ ఉంటారు. ఇలా సైలెంట్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఈ హీరో.

కానీ అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతానికి చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఎన్నికల్లో.. తన వైయస్సార్సీపి ఫ్రెండ్ శిల్పారెడ్డికి.. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన దగ్గర నుంచి.. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చర్చ సాగుతోంది. ఇక దీనికి బలం చేకూరుస్తూ.. నాగబాబు ట్వీట్స్ నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోని డైలాగ్స్.. అలానే ఈవెంట్స్ లో ఆయన ప్రవర్తన.. ఆయనకు మెగా ఫ్యామిలీ పై ఎంతటి కోపం ఉందో చూపిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం.. డిసెంబర్ 4న.. ప్రీమియర్స్ తో తెలుగు ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో నుంచే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కానీ ఈ సినిమా పైన.. మెగా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణం.. అల్లు అర్జున్ ప్రవర్తన. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ లాంటి హీరో పేరు ఎత్తిన అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వచ్చినా.. కానీ రామ్ చరణ్ పేరు ఎత్తలేదు. ఒకప్పుడు మెగా హీరోల గురించి తప్పకుండా మాట్లాడే ఈ అల్లు హీరో.. ఎక్కడ కానీ మెగా హీరోల పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. 

దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్పుడే.. మెగా అభిమానులు అల్లు అర్జున్ పై కోపం పెంచుకున్నారు. కానీ సినిమా విడుదలకు ముందు సాయి ధరంతేజ్ కి అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడంతో.. వీరి మధ్య లాంటివి ఏమీ లేవులే అనుకున్నారు. అలాంటివారికి సినిమా చూశాక షాక్ ఎదురైంది.. పలు సందర్భాల్లో ఇన్ డైరెక్ట్ గా మెగా హీరోలను టార్గెట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉండడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. ఇవి ఎక్కడ కాని డైరెక్టుగా పెట్టకపోయినా.. చూసిన వారికి అవి తప్పకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించిన డైలాగ్స్ అని అర్థమయ్యేలా ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ ఇలా ధైర్యంగా.. మెగా ఫ్యామిలీకి ఎదురు వెలుతు..ముందుకు సాగదం చూసి.. ‘మన బన్నీ ఎన్టీఆర్ లా సైలెంట్ కాదు.. ఎవరన్నా పడకపోతే తగ్గేదెలా.. అని ముందుకు పోతారు,’ అని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక.. ఇదంతా కూడా మెగా అభిమానులు, మెగా హీరోలు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్లే అని.. బన్నీ కరెక్ట్ గానే చేస్తున్నారని.. సాధారణ ప్రేక్షకులు సైతం కామెంట్లు పెట్టడం గమనర్హం.

Also Read: AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్‌ 'డ్రోన్‌'.. సీఎం చంద్రబాబు ఆదేశం

Also Read: Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రోగ్రామ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News