Venu swamy prediction on allu arjun: వేణు స్వామి ఈ పేరు చెబితేనే కాంట్రవర్షీలకు కేరాఫ్ అని అంటుంటారు. ఎప్పుడైతే ఆయన చైతు,సమంతలకు విడాకులు అవుతుందని జ్యోతిష్యం చెప్పారో.. ఒక్కసారిగా ఆయన వార్తలలో నిలిచారు. మరీ ఆయన అన్నట్లు గానే..ఈ జంట పెళ్లైన కొన్నేళ్లకు విడిపోయారు. మరోవైపు వేణు స్వామి మాత్రం పొలిటికల్ గా కొన్నిసార్లు జాతకాల విషయంలో బొక్కబొర్లా పడినట్లు తెలుస్తొంది.
ఏపీలో మరల వైసీపీ వస్తుందని, చంద్రబాబు ఓటమి పాలౌతారని జ్యోతిష్యం చెప్పారు. అదే విధంగా తెలంగాణలో కేసీఆర్ మరల అధికారంలోకి వస్తారన్నారు. వీటికి పూర్తిగా రివర్స్ ఘటనలు జరిగాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వేణు స్వామి మాత్రం.. రాజకీయ నేతలు, సెలబ్రీటీల జాతకాలు చెప్పనని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల.. శొభితలు, చైతుల ఎంగెజ్ మెంట్ అయ్యాక.. వీరు మరల విడిపోతారని ఆయన చేసిన వ్యాఖ్యలు హైకోర్టు వరకు కూడా వెళ్లాయి.
ఈ క్రమంలో మహిళ కమిషన్ సైతం వేణు స్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయన ఇటీవల రిలీజై ట్రెండింగ్ గా మారిన పుష్ప2 మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
వేణుస్వామి తాజాగా, పుష్ప2 మూవీ సినిమాను చూసినట్లు చెప్పారు. అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా గంగమ్మ జాతర సీన్ లో.. అల్లు అర్జున్ మాతంగీలా చీరకట్టుకుని అదిరిపోయే విధంగా నటించారన్నారు. అల్లు అర్జున్ ను ఆ సీన్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ కు రాబోయే 15 ఏళ్ల పాటు.. ఇండస్ట్రీలో తిరుగులేదన్నారు.
అల్లు అర్జున్ తో సినిమా తీసే ఏ నిర్మాత అయిన నష్టపోడని అన్నారు. పుష్ప2 సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ పై, పుష్ప2 సినిమాపై గతంలోనే తాను హీట్ అవుతుందని చెప్పానని అన్నారు.
ఈ క్రమంలో పుష్ప 2 అభిమానులు మాత్రం.. తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారంట. మరోవైపు కొంత మంది మాత్రం.. సెలబ్రీటీల జాతకంచెప్పనని వేణు స్వామి మరల మాట తప్పాడని ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది.