Allu Arjun interesting comments on pawan kalyan: పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తుందని చెప్పుకొవచ్చు. ఎక్కడ చూసిన పుష్ప2 మూవీ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా కలెక్షన్ ల పరంగా కూడా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను పుష్పరాజ్ బ్రేక్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఈనెల 5 విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో..అల్లు అర్జున్, రష్మిక మందన్న కీరోల్ ప్లే చేశారు. అదే విధంగా.. పుష్ప 2 మూవీ విడుదలయ్యాక.. అందులోని కొన్ని డైలాగులు కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే.
అయితే... సినిమాలోని లేని డైలాగులను కొందరు కావాలని ట్రోల్స్ చేశారని మూవీ టీమ్ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో మాత్రం.. మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ ల మధ్య సొషల్ మీడియాలో విపరీతంగా గొడవలు జరిగినట్లు తెలుస్తొంది. అయితే.. గతంలో ఏపీలో ఎన్నికల సమంయంలో అల్లు అర్జున్.. నంద్యాలకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంకు వెళ్లారు.
కళ్యాణ్ బాబాయ్ .. థాంక్యూ సో మచ్ - @alluarjun
Emunna memu memu chusukuntam… ee situation ni political ga vadukundam ani chusaru ycp sannasulu.. ika salla badandi
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) December 7, 2024
అప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు గా మారిపొయిందని చెప్పుకొవచ్చు. దీంతో వీరు అప్పటి నుంచి ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పుష్ప2 మూవీ రిలీజ్ అయ్యింది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాలు సైతం.. బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా, అల్లు అర్జున్ పుష్ప2 మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండు తెలుగు స్టేట్స్ ల ప్రభుత్వాలకు, సీఎంలకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు. అయితే.. అల్లు అర్జున్ .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ సంభోధించి మరీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా చప్పట్లు కొట్టినట్లు తెలుస్తొంది.
అంతే కాకుండా.. టికెట్ల విషయంలో ప్రత్యేకంగా చొరవచూపిన పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్‌గా ధన్యవాదాలు చెప్పారు. అంతే కాకుండా మీకు పర్సనల్ నోట్.. కళ్యాణ్ బాబాయ్ థైంక్యూ సోమచ్.. అంటూ చెప్పి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా కేకలు పెడుతు రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ప్రస్తుతానికి మెగా వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ ల గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తొంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook