Jinn Movie Updates: అమిత్ రావ్ హీరోగా.. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ జిన్. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర కో ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ.. డైలాగ్స్ కూడా రాస్తున్నారు. పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్‌రాజ్ వాడి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో పూజా కార్యక్రమాలతో జిన్ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా మొదలైంది. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
అనంతరం రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. జిన్ మూవీని తెలుగుతోపాటు కన్నడలో కూడా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రొడ్యూసర్ కందుకూరి మాట్లాడుతూ.. జిన్ సినిమా టైటిల్ బాగుందని మెచ్చుకున్నారు. సస్పెన్ హారర్ థ్రిల్లర్ జానర్లో కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని.. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులకు ఈజీగా రీచ్ అవుతుందన్నారు. హీరోగా అమిత్ రావ్ మంచి పేరు తెచ్చుకోవాలని.. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
డైలాగ్ రైటర్, సహ నిర్మాత వరదరాజ్ చిక్కబళ్లాపుర మాట్లాడుతూ.. తాము జిన్ కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించిందని చెప్పారు. అమిత్ రావ్ మంచి యాక్టర్ అని.. దర్శకుడు చిన్మయ్ రామ్ టాలెంటెడ్ టెక్నీషయన్ అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. నిర్మాత నిఖిల్ ఎమ్ గౌడ మాట్లాడుతూ.. జిన్ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు.
హీరో అమిత్ రావ్ మాట్లాడుతూ.. జిన్ సినిమా స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్‌గా ఉంటుందని.. మంచి విజువల్స్‌తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ చిన్మయ్ రామ్ మాట్లాడుతూ.. ఇది తనకు తొలి సినిమా అని.. మంచి కథ, స్క్రిప్ట్ పర్పెక్టగా వచ్చేందుకు చాలా టైమ్ తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా కీర్తి రాజ్ డి పనిచేస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా సునీల్ హొన్నాళి వ్యవహరిస్తున్నారు. అలెక్స్ సంగీతం అందిస్తున్నారు. కథ స్క్రీన్ ప్లే బాధ్యతలను పర్వీజ్ సింభ నిర్వర్తిస్తున్నారు.
Also Read: AP Telangana Rains: మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..
Also Read: Pushpa2 Success Meet: బాధిత కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను.. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook