Rajendra Prasad: పుష్ప 2 హీరో పై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. వాడు హీరోనా అంటూ..?

Rajendra Prasad about Pushpa 2:  ఇటీవల, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ "హీరో" అనే పదానికి కొత్త అర్థం దక్కుతోందని.. కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. సినిమాలలో హీరోల క్యారెక్టరైజేషన్ క్రమంగా మారిపోతుందన్న ఆయన..నెగెటివ్ పాత్రలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని అభిప్రాయపడ్డారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 10, 2024, 11:30 AM IST
Rajendra Prasad: పుష్ప 2 హీరో పై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. వాడు హీరోనా అంటూ..?

Rajendra Prasad about Allu Arjun: రాజేంద్ర ప్రసాద్ ఇటీవల “హరికథ” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ..”ఇప్పటి కథలకి కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రపై పేర్కొన్నట్లుగా.. చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు. ఈ పాత్రకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పొందగా, అప్పట్లో కొందరు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  

ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందట..తన వ్యాఖ్యల ద్వారా ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం కథల మార్పులపై తన అభిప్రాయం మాత్రమే చెప్పినట్లు రాజేంద్ర ప్రసాద్ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది. 

“కలియుగంలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు తీసుకుంటే.. నిన్నగాక మొన్న చూసాం. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో. హీరోయిన్స్ అర్థం మారిపోయింది. నాకున్న అదృష్టం ఏంటంటే, నేను 48 సంవత్సరాలుగాహ. సమాజనంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ తో డిఫెరెంట్ హీరో అని పేరు తెచ్చుకున్నాను. 'లేడీస్ టైలర్'లో హీరోని తీసుకుంటే అతను ఒక సన్నాసి.. 'అప్పుల అప్పారావు' 'పేకాట పాపారావు' సినిమాల్లో వాడు హీరోనా?.. 'ఏప్రిల్ 1 విడుదల' లో కూడా హీరో ఒక దొంగ. కానీ సమాజంలో మన చుట్టూ, మనతో పాటు మన పక్కనే ఉన్న అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని, హీరోగా నటించి ఇంతకాలం మీ ముందు నేను ఉన్నాను” అని అన్నారు. ఇప్పుడు 'హరికథ' సినిమాలోనూ మంచి పాత్ర పోషించినట్లుగా ఆయన తెలిపారు. ఏఎన్నార్, ఎన్టీఆర్ చేయాల్సిన పాత్ర తనకు దక్కడం సంతోషంగా ఉందని.. చెప్పుకొచ్చారు.

ఇలా ఆయన అన్న మాటలు వింటూ ఉంటే.. ఆయన కేవలం ప్రస్తుతం హీరోయిజం కి ఉన్న అర్థం మారాలి అన్న ఉద్దేశంతో మాత్రమే అన్నారు అని.. అంతేకానీ పుష్ప లేదా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేయాలని కాదు అని అర్థమవుతుంది. అయితే కొంతమంది మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుస్తున్నారు. 

ఇదీ చదవండి: Padamati Sandhyaragam: ఆదిత్యతో ఆద్య పెళ్లి.. పెదనాన్నకు రిటర్న్‌ గిఫ్ట్‌, వెంకట్రావ్‌ వెకిలివేషాలు..

పాత కాలపు కథల్లో హీరోలను “మంచి బాలుడు”గా చిత్రీకరించేవారు. కానీ ఇప్పటి కథల్లో హీరో పాత్రలకు నెగెటివ్ షేడ్స్ ఇచ్చి, వాటిని కథ యొక్క ప్రధాన బలంగా మార్చుతున్నారు. అల్లు అర్జున్, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులు ఈ తరహా పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న వారే.  కాబట్టి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి తప్పులేదు. అలా అని ఇప్పటికిప్పుడు రాముడు మంచి బాలుడు అన్నట్టు హీరోని పెట్టి సినిమాలు తీస్తే.. అవి మాస్ ఆడియన్స్ నుంచి ఆకట్టుకుంటాయా.. అనే దాని పైన కూడా ఎంతోమందికి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పటికీ తేలని చర్చ. ఇందుకోసం రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ మధ్య ఏదో ఉన్నట్టు.. ఆయన అల్లు అర్జున్ ఇన్ డైరెక్ట్ గా అన్నట్టు అనుకోవడం మాత్రం మన తప్పే అవుతుంది.

రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్ కలిసి ‘జులాయి’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాల్లో నటించారు. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి అనుబంధం ఉంది. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో జరిగిన విషాద సమయంలో.. అల్లు అర్జున్ పరామర్శకు వెళ్లారు.  కాబట్టి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను పుష్పరాజ్ పాత్రను వ్యతిరేకించేలా అనుకోవద్దని, ఆయన కేవలం హీరోల పాత్రల మార్పులను చర్చించేందుకు మాత్రమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎంతోమంది అభిమానులు అభిప్రాయపడుతున్నాడు.

ఇదీ చదవండి: Brahmamudi: రాజ్‌పైకి ధాన్యలక్ష్మి ఉసిగొల్పిన రుద్రాణికి దిమ్మదిరిగే షాక్‌.. ఆస్తి మొత్తం కావ్యకు రాసేసిన తాతయ్య..! 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News