Jamili Election: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై పట్టుదలతో ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై నియమించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేస్తే చాలు. ఎప్పుడు అమల్లోకి వచ్చేది తేదీ నిర్ణయించవచ్చు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలంటే దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాకంలో ఎన్నికలు నిర్వహించడం. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవల నివేదికను కూడా సమర్పించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని, ఐదు ఆర్టికల్స్ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకు పంపించనుంది. అన్ని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ స్పీకర్లు, మేధావులు, సాధారణ ప్రజలతో చర్చించనుంది.
దేశంలో ఏకకాల ఎన్నికలు నిర్వహించాలంటే ఆర్టికల్ 327 సహా పలు రాజ్యాంగ సవరణలు అవసరం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో ఆమోదంతో పాటు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు ఉండాలి. సాధారణంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ పరిధిలో ఉంటాయి. జమిలి ఎన్నికల ద్వారా ఆర్ధిక భారం, పరిపాలనా భారం గణనీయంగా తగ్గించవచ్చు.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ జమిలీ ఎన్నికల నిర్వహణపై కొన్ని సూచనలు చేసింది. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. రెండో దశలో దేశమంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఇప్పుుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమౌతుందని తెలుస్తోంది. అంటే ఎన్నికలు 2027లో ఉండవచ్చని అంచనా.
Also read: Redmi Note 14 Series: రెడ్ మి నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో మూడు మోడల్స్ లాంచ్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి