Congress Politics: రేవంత్‌కు టెన్షన్‌.. కేబినెట్‌లో విస్తరణలో కొత్త ట్విస్ట్‌!

Congress Party diloma in Post: తెలంగాణ కాంగ్రెస్‌లో పోస్టుల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చిందా..! మంత్రి పదవులు, పార్టీ పదవుల భర్తీ విషయంలో పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారా..! మొదట మంత్రి పదవులను భర్తీ చేయాలనుకున్న పార్టీ పెద్దలు.. పోస్టుల విషయంలో మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గారు..! ఇంతకీ తెలంగాణలో పోస్టుల పంపిణీ జరిగేది ఎప్పుడు..!

Written by - G Shekhar | Last Updated : Dec 11, 2024, 07:11 PM IST
Congress Politics: రేవంత్‌కు టెన్షన్‌.. కేబినెట్‌లో విస్తరణలో కొత్త ట్విస్ట్‌!

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. సర్కార్‌ వచ్చి ఏడాది పూర్తి కావడంతో పదవుల పంపకాలపై నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. మొన్నటివరకు ఇదిలో పోస్టులు అదిగో పదవులు అన్న పార్టీ పెద్దలు.. ఇప్పుడు పదవులు విషయంలో మరోసారి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ముందు పార్టీ పదవులు ఇవ్వాలా..? లేదంటే మంత్రి పదవులు భర్తీ చేయాలా అని పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీ చీఫ్‌ మహేష్ కుమార్‌గౌడ్‌ ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తేగానీ ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేలా లేదని గాంధీభవన్‌వర్గాలు అంటున్నాయి..

రాష్ట్రంలో కొత్త పీసీసీ చీఫ్‌ నియామకం జరిగి మూడు నెలలు దాటింది. కొత్తగా మహేష్‌ కుమార్ గౌడ్‌ టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ పదవుల పంపకాలపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో అన్ని స్థాయిల్లో నేతలకు పదవులు ఇచ్చే అంశంపై టీపీసీసీ పలువురి పేర్లను ఫైనల్‌ కూడా చేసినట్టు సమాచారం. అయితే పార్టీలో చాలామంది ఆశావాహులు ఉండటంతో పదవుల పంపకాలపై పార్టీ పెద్దలు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారట. ఈనేపథ్యంలోనే ఒక్కరికి ఒకే పదవి కట్టబడితే బాగుంటుందని మెజారిటీ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయంగా తెలుస్తోంది. ఒక్కరికి ఒక్క పదవి ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి పదవులు ఇచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారట. అలాగే పలు జిల్లాల్లో అధ్యక్షులుగా ఉన్న నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఆయాచోట్ల కూడా కొత్త ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ, నామినేటేడ్‌ పోస్టుల విషయం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కేవలం నాలుగు మంత్రి పదవులే ఇప్పుడు భర్తీ చేస్తారని మిగతా రెండు పోస్టుల భర్తీ తర్వాతే ఉంటుందని ప్రచారం జరిగింది. దాదాపు ఆర్నెళ్లుగా పార్టీ పదవుల పంపకాలు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడంతో పదవులు పంపకాలు షురూ కాబోతున్నాయని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి పదవుల పంపిణీ విషయంలో పార్టీ పెద్దలు పునరాలోనచనలో పడినట్టు తెలుస్తోంది. మొదట పార్టీ పదవులు భర్తీ చేయాలా..! లేదంటే పార్టీ పదవులను పూర్తి చేయాలా అని తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ఇదే విషయమై టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌ ఢిల్లీ వెళ్లి వచ్చాక ఓ క్లారిటీ వస్తుందని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి.

మొత్తంగా మెజారిటీ నేతల్లో మాత్రం పార్టీ పదవులు భర్తీ చేశాకే.. మంత్రి పదవులు, నామినేటేడ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో లోకల్‌ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపు పార్టీ పదవులు పూర్తి చేస్తే.. పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా.. ఎక్కువ లాభం జరుగుతుందని చెబుతున్నారట. కానీ.. పార్టీ హైకమాండ్ మాత్రం.. ఏ పోస్టులు మొదట భర్తీ చేయాలా అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది..

Also Read: BJP Telangana: టీ బీజేపీలో కోల్డ్‌వార్‌.. కొత్త ప్రెసిడెంట్‌ రావాల్సిందేనా!

Also Read: JUKKAL Politics: సొంత పార్టీ లీడర్లపై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రివేంజ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News