Thota Laxmikantha Rao: కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి ఆయన సొంత పార్టీ నేతలనే కటాకటాల వెనక్కి నెట్టారు. కామారెడ్డి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణా రావు పర్యటన ఉన్న నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గానికి చెందిన చాలామంది నేతల్ని ముందుస్తు అరెస్టులు చేయించారు. అయితే మండలపార్టీ లీడర్లను ఎమ్మెల్యే అరెస్టు చేయడంతో జిల్లా కాంగ్రెస్‌లో ఈ హాట్‌టాపిక్ అయ్యింది. అధికార పార్టీ నేతల్ని ఎమ్మెల్యే అరెస్టు చేయించడం ఏంటని సొంత పార్టీ లీడర్లే ఎమ్మెల్యేపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ నుంచి గెలుపొందారు తోట లక్ష్మీకాంతారావు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న ఆయన.. అక్కడ కాంగ్రెస్ పార్టీ హవాలో విజయం సాధించారు. అయితే లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయినట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీపై పోరాటం చేసిన జుక్కల్ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంతృప్తి లేదట. ముఖ్యంగా లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
ఇటీవల జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మార్కెట్ పదవి ఎంపిక జరిగింది. ఈ మార్కెట్ చైర్మన్ పోస్టు ఎస్సీకి రిజర్వ్ కావడంతో.. చాలామంది లీడర్లు పోటీపడ్డారు. దాంతో వినూత్నంగా ఆలోచించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ పోస్టు ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ వేశారు. ఇందులో 3 మండలాల కాంగ్రెస్ అధ్యక్షుడు, మరో ముగ్గురు సీనియర్‌లీడర్లకు కమిటీలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత మార్కెట్ కమిటీ పోస్టుకు పరీక్ష నిర్వహించారు. అయితే ఈ ఎగ్జామ్‌కు దాదాపు 15 మంది నేతలు హాజరయ్యారు. అనంతరం ఇంటర్వ్యూ సైతం నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది.
వాస్తవానికి తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేదని క్యాడర్ అంటోంది. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించామని అంటోంది. తమ కష్టంపై గెలిచినా ఎమ్మెల్యే తోట ఇప్పుడు తమపైనే కక్ష కట్టారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గంలో అనేక పోస్టులు భర్తీ అవుతున్నాయి. కానీ ఎమ్మెల్యే మాత్రం తమను పట్టించుకోవడం లేదని కిందిస్ధాయి నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడలేని రీతిలో నేతలను పదవులకు ఎంపిక చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ జుక్కల్ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో ధర్నా చేశారు. ఈ ధర్నా ఎఫెక్ట్ ఎమ్మెల్యేపై పడిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మంత్రి పర్యటనను సొంత పార్టీ లీడర్లు అడ్డుకుంటారనే భయంతోనే.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సొంత పార్టీ లీడర్లను ముందస్తు అరెస్టు చేయించారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది..
Also Read: KT Rama Rao: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కా
Also Read: BRS Politics: గులాబీ పార్టీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.