Shoes Theft: హైదరాబాద్‌లో ఓ వింత దొంగ హల్‌చల్‌.. అతడి లక్ష్యం కేవలం బూట్లు మాత్రమే!

Shoes Thieve Arrested By Uppal Police: ఇన్నాళ్లు రకరకాల దొంగతనాల గురించి విని ఉంటారు.. కానీ ఇలాంటి దొంగను మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు.. విని ఉండరు. బంగారం, వెండి, వజ్రాలను వదిలేసి కేవలం బూట్లను దొంగతనం చేసే దొంగ పోలీసులకు చిక్కాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 12, 2024, 07:49 PM IST
Shoes Theft: హైదరాబాద్‌లో ఓ వింత దొంగ హల్‌చల్‌.. అతడి లక్ష్యం కేవలం బూట్లు మాత్రమే!

Crazy Thieve Arrest: దొంగలందు ఈ దొంగ వేరయా.. ఇతడి కళ్లన్నీ ఖరీదైన వస్తువులు.. డబ్బుపై ఉండదు. కేవలం మనం ధరించే బూట్లపైనే కన్ను ఉంటుంది. ఇంట్లో ఉన్న బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు కనిపించినా సరే అతడు ఎత్తుకెళ్లేది మాత్రం కేవలం షూస్‌లనే. ఎక్కడ షూస్‌ కనిపిస్తే అక్కడ అతడు ప్రత్యక్షమవుతాడు. ఇలా హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేస్తున్న బూట్ల దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. బూట్లులు దొంగతనానికి గురవుతున్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో నిఘా పెంచిన పోలీసులు అతడిని వల పన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..

హైదరాబాద్‌లోని రామంతపూర్ ప్రాంతంలో తరచూ షూస్‌ల దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బూట్లు దొంగతనంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల నుంచి ఇదే సమస్య ఉండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు బూట్లు దొంగలించే దొంగను పట్టుకున్నారు. దొంగను పట్టుకుని విచారణ చేయగా విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. అతడు చెప్పిన మాటలు విని పోలీసులు నివ్వెరపోయారు. 

Also Read: AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. సీసాలు సీసాలు తాగేశారు

ఆ దొంగ పేరు మల్లేశ్‌. అతడు రామంతపూర్‌లోని వాసవీ నగర్‌లో తన భార్య రేణుకతో కలిసి నివసిస్తున్నాడు. రెండు నెలల నుంచి సుమారుగా 100 ఇళ్ల వరకు పైగా దొంగతనం చేశాడు. అయితే దొంగతనం చేసింది మాత్రం బూట్లను మాత్రమే. ఇప్పటివరకు వెయ్యి బూట్ల (జత)ను ఎత్తుకెళ్లాడు. నాలుగు రోజులపాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీవాసులు అతడిని పట్టుకున్నారు. పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ప్రత్యేకంగా బూట్లు ఎందుకు దొంగతనం చేస్తున్నాడనే విషయం ఆరా తీయగా కీలక విషయం బయటకు వచ్చింది.

దొంగతనం చేసిన బూట్లను మల్లేశ్ సేకరించి అనంతరం ఎర్రగడ్డలో వాటిని రూ.వంద.. రూ.200కు విక్రయిస్తున్నట్లు ఉప్పల్ పోలీసుల విచారణలో తేలింది. అయితే భర్త దొంగతనంపై భార్య రేణుకను ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారించగా ఆమె మద్యం మత్తులో వచ్చి రావడం గమనార్హం. పోలీస్ స్టేషన్‌కు వచ్చి హల్‌చల్ చేయడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో వైరల్‌గా మారింది. ఇలాంటి దొంగను తాము ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు అంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News