Telangana Ration Cards: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా పది లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Also Read: Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?
తెలంగాణ శాసనమండలిలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు కోదండరెడ్డి, మీర్జా రియాజుల్ హసన్, జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా వాటికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ కొత్త రేషన్ కార్డుల జారీ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని ప్రకటించారు. దీనిద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వేను ఆధారం చేసుకుంటామని తెలిపారు. రేషన్ కార్డులకు ప్రభుత్వంపై అదనంగా రూ.956 కోట్ల భారం పడుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: BRS Party: బీఏసీ అంటే బిస్కట్ చాయ్ సమావేశం కాదు.. బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరణ
రేషన్ కార్డులలో అదనపు పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రం ద్వారా 18 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం నియమించామని, తాను చైర్మన్‌గా ఉన్నట్లు గుర్తుచేశారు. అన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీకి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ చేసిన సిఫారసులు మంత్రివర్గం ముందు ఉంచినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేస్తామని, గ్రామ పంచాయతీలతో పాటు తండాలలో కూడా కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు ఉంటుందని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter