BRS Party: బీఏసీ అంటే బిస్కట్ చాయ్ సమావేశం కాదు.. బీఆర్‌ఎస్‌ పార్టీ బహిష్కరణ

BRS Party Boycotts Assembly Session: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో రేవంత్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఏసీ అంటే చాయ్‌ బిస్కెట్ సమావేశం కాదని చెబుతూ సమావేశాన్ని వాకౌట్‌ చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 16, 2024, 03:20 PM IST
BRS Party: బీఏసీ అంటే బిస్కట్ చాయ్ సమావేశం కాదు.. బీఆర్‌ఎస్‌ పార్టీ బహిష్కరణ

Telangana Assembly Session: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల అజెండా చర్చించేందుకు సమావేశమైన బీఏసీ సమావేశాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ బహిష్కరించింది. ఈ సమావేశ చాయ్‌ బిస్కెట్‌ సమావేశంలాగా మారిందని భావిస్తూ సమావేశం నుంచి గులాబీ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. వాకౌట్‌ చేసిన అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

Also Read: Revanth Reddy Lunch: రేవంత్ రెడ్డి భోజనంపై రాజకీయ దుమారం.. రూ.3,200తో భోజనమా?

 

బీఏసీ అంటే చాయ్ అండ్‌ బిస్కెట్‌ సమావేశం కాదంటూ… ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినట్లు మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. 'ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం' అని తెలిపారు. 'రేపు లగచర్ల అంశంపైన చర్చకు మేం పట్టు పడతాం. ఒక రోజు ప్రభుత్వానికి.. మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టాం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాలా కీలకం' అని వెల్లడించారు. కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read: K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలనం.. రేవంత్‌ రెడ్డిని ధిక్కరించి తెలంగాణ తల్లికి శంకుస్థాపన

 

'బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుందది. హౌస్ కమిటీలు ఏర్పాటుచేయాలి. పీఏసీ కమిటీపైన మా పార్టీ అభిప్రాయం కాకుండా ఏట్లా నిర్ణయం తీసుకుంటారు' అని స్పీకర్‌ను మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా చూసుకుంటామని స్పీకర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. బీఏసీ లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు. పుట్టిన రోజులు, పెళ్లిలు ఉండడంతో సభ వాయిదా వేయడంపైన అభ్యంతరం చేసినట్లు హరీశ్ రావు వెల్లడించారు. ప్రతిరోజు జీరో ఉండాలని డిమాండ్ చేశారు. 'మా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య మేరకు మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం. మేం టీషర్టులతో వస్తే అడ్డుకున్న తీరు దారుణం. రాహుల్ గాంధీకి లోక్‌సభలో పోయినప్పుడు మమ్మల్ని ఎట్లా అపుతారు? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News