Brahmamudi Today December 19th Episode: ఆపండి.. ఇన్నాళ్లు నా భర్త ముందు మాట్లాడానికి కూడా భయపడే మీరు మతిస్థిమితం లేదు అంటారా? ఛీ, మీరు అసలు మనుషులేనా నాభర్త మీద కేసు వేస్తారా? చావు బతుకు మీద ఉన్న మనిషికి తెలిస్తే.. మాట పోతే ప్రాణాలు వదిలేస్తాడు అని అమ్మమ్మ గుండెనొప్పితో కుప్పకూలుతుంది. కట్ చేస్తే ఇదంతా రాజ్ కల కంటాడు. హమ్మయ్య.. నానమ్మ ఏం కాలేదు. ఇదంతా కలా? అని నీళ్లు తాగుతాడు. బ్యాంకు వాళ్లు చెప్పినట్లు డబ్బు కట్టకపోతే ఈ కలే నిజం అవుతుంది. కానీ, ఏం చేయాలి? బ్యాంకు లోన్‌కు వెళ్లడమే బెట్టర్ అనిపిస్తుంది అని రాజ్ బ్యాంకు అధికారులకు ఫోన్ చేస్తాడు. ప్రాపర్టీ డాక్యుమెంట్లని మీ పేరు మీదే ఉన్నాయి కదా అంటాడు. మా వైఫ్ పేరు మీద ఉంది అంటాడు. ఆమె తప్పకుండా రావాలి అంటాడు. అమ్మో కళావతి ఈ విషయం చెబితే ఒప్పుకుంటుందా? అని తన అంతరాత్మతో మాట్లాడుకుంటాడు.
కావ్యను ఎలా ఒప్పించాలో నానా తంటాలు పడతాడు. ఇప్పుడు ఈగోకు వెళ్లే సమయం కాదు. మా తాతయ్య ఆస్తిని ఎవరిని అడుగుతాను. నా పెళ్లాన్నే కదా నాకు ఏం తక్కువేం కాదు అంటాడు. ఇక డైనింగ్ టేబుల్‌పై అందరూ తింటు ఉంటారు.ఏంటి కూరలు అన్ని ఇంత చప్పగా ఉన్నాయి అంటుంది ధాన్యం. ఉప్పేసిన ఏం లాభం అనుకున్నావా? కావ్య అంటుంది అపర్ణ. అత్తగారు వెనకేసుకు వస్తున్నారు కదా నడమంతరపు సిరి తలకెక్కినట్లు అంటుంది ధాన్యం. ఫస్ట్ చేయాల్సిన పని నా అత్తను, మొగున్ని బయటకు గెంటేయాలి కదా అంటుంది స్వప్న. మిమ్మల్ని పని మనిషి కంటే హీనంగా చూడాలి కదా అంటుంది స్వప్న.
నువ్వు కూడా బయటకు వెళ్లాలి కదా అంటుంది. నాకేం అవసరం నాకు నా పుట్టబోయే బిడ్డకు తాతయ్య ఆస్తి రాసిచ్చాడు కదా అంటుంది స్వప్న. ఒక్కపూట ఉప్పు తక్కువైతే ఆమాత్రం సర్దుకోలేవా? అంటుంది అపర్ణ. అయ్యోయ్యో మనం మహాలక్ష్మిని ఏం అనకూడదు. మనం చెలికత్తెలం. అంతేకదా అన్నయ్య అంటుంది రుద్రాణీ.
అప్పుడే రాజ్ వస్తుంటాడు. కావ్యను ఎలా ఇంప్రెస్ చేయాలా? అని ఆలోచిస్తుంటాడు. ఏం కళావతి వంటలన్ని ఘుమఘుమలాడిపోతున్నాయి. కమ్మటి వాసన వస్తుంది కళావతి వంటకు వంక పెట్టేవారు ముష్టి ఎత్తుకుని బతకాలి అంటారు. దీంతో రుద్రాణీ కళ్లు పెద్దవిగా చేసుకుని చూస్తుంది. కళావతి చేతిలో ఏం మహత్యం ఉందో కానీ, అన్ని సరైన మోతాదులో వేస్తుంది అంటాడు. దీంతో ధాన్యం పొగడ్తలు ఆపి తిని చూడు రాజ్ అంటుంది. భోజనం వడ్డిస్తుంది మనస్సులో ఇవాళే ఉప్పు తగ్గాలా? అనుకుంటాడు. బయటకు నేను చెప్పాను కదా నీ వంటకు వంక పెట్టే అవసరం లేదని అంటాడు. రాజ్ అబద్దం చెప్పకు కూరలన్ని చప్పగా ఉంటే నువ్వు పొగుడ్తున్నావ్ అంటుంది.
ఇదీ చదవండి: జియో యూజర్లకు బంపర్ ఆఫర్... 98 రోజుల అన్ లిమిటెడ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..
అయ్యో అలా అనకూడదు ఇక్కడి అందరి మనోభావాలు దెబ్బతింటాయి. నువ్వు చాలా బాగా వంట చేశావు కావ్య అంటుంది.నిన్న మొన్న పెళ్లాన్ని వదిలేసిన రాజ్ ఇవాళ మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లాం చేతిలో ఇంటి తాళాలు ఉండేసరికి నెత్తిన పెట్టుకుంటున్నాడు అంటుంది. రాజ్ నీలాగే మేం కూడా నటిస్తాం అంటుంది ధాన్యం. ఆపండి ఆస్తుల కోసం ఒకరిని పొగిడి భజన చేసి బతకాల్సిన పని నాకు పట్టలేదు అని చేతులు కడుక్కుని తినకుండానే వెళ్లిపోతాడు. కావ్య కూడా ఛీ కొట్టి వెళ్తుంది.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత..!
ఆసుపత్రిలో ఉన్న కవికి మళ్లి పొట్టి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావ్ అంటుంది. పాటరాస్తున్నా అని చెబుతాడు. నాకు తెలుసు కవి నీ పక్కనే నేను లేకపోయినా నీ మనసులో నేనే ఉంటా అని అంటాడు. తన ట్రైనింగ్ బాధల గురించి చెబుతుంది. పోలీస్ ట్రైనింగ్ అంటే అలాగే ఉంటుంది పొట్టి అంటాడు. నీకోసమే ఇంత కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నా అంటాడు. అప్పుడు రాజ్ కావ్యకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. కావ్య చేతులు పట్టుకుంటాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.