Revanth Reddy Vs Allu arjun: అల్లు అర్జున్ అసలు మనిషేనా..?.. అసెంబ్లీలో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి.. వీడియో..

Pushpa 2 movie controversy: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రెచ్చిపోయారు. అసలు అల్లు అర్జున్ మనిషేనా.. అంటూ ఏకీపారేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 21, 2024, 03:31 PM IST
  • అల్లు అర్జున్ ను ఏకీపారేసిన రేవంత్..
  • సంధ్య థియేటర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు..
Revanth Reddy Vs Allu arjun: అల్లు అర్జున్ అసలు మనిషేనా..?.. అసెంబ్లీలో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి.. వీడియో..

Revanth Reddy fires on allu arjun in assembly session: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.అయితే.. తాజాగా.. అల్లుఅర్జున్ మాత్రం బెయిల్ మీద బైటకు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై ఫైర్ అయ్యారు.

అసలు.. అల్లుఅర్జున్ మనిషేనా.. అంటూ ఏకీపారేశారు.  సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ వల్లే జరిగిందని ఫైర్ అయ్యారు. ఈ థియేటర్ లో ఎంట్రీ, ఎక్జీట్ ఒకటే ఉందన్నారు. పోలీసులు చెప్పిన కూడా.. అల్లు అర్జున్ విన్పించుకోకుండా వచ్చారన్నారు. తొక్కిసలాట జరిగాక.. అక్కడ డీసీపీ వచ్చి.. అల్లు అర్జున్ ను వెళ్లిపోమ్మంటే.. కారులో కూర్చుని.. మరల రూఫ్ తెరచి.. అభిమానులకు అభివానం చేశారన్నారు.

 

దీంతో మరింత తోపులాట జరిగిందన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు.. కోమాలో ఉన్నాడు. ఈ ఘటనకు బాధ్యత పూర్తిగా అల్లు అర్జున్ దే అన్నారు. ఆయన మనిషేనా..అంటూ ఫైర్ అయ్యారు. అందుకే పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యంపై, అల్లుఅర్జున్ పై కేసుల్ని నమోదు చేశారన్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ ను పరామర్శించేందకు క్యూలు కట్టారు.

మరీ.. ఆ బాలుడు, వారి కుటుంబాన్ని ఒక్కరైన పరామర్శించారా.. అని ఫైర్ అయ్యారు. బాలుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారన్నారు. అల్లు అర్జున్ కు.. కాలు విరిగిందా.. చేతి విరిగిందా.. సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్లి కలిశారని అని ఏకీ పారేశారు. 

 ఈ ఘటనను కొన్ని రాజకీయా పార్టీలు వక్రీకరిస్తున్నాయన్నారు. ఆ అభిమాని కుటుంబం.. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు... 

అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే... తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారన్నారు.

Read more: Ram Gopal Varma: స్వర్గంలో ఉన్న శ్రీదేవీని కూడా అరెస్ట్ చేస్తారా..?.. తెలంగాణ పోలీసులపై సంచలన పోస్ట్ పెట్టిన ఆర్జీవీ..

సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రజల ప్రాణాలు బలితీసుంటామంటే.. చూస్తు ఊరుకోమన్నారు. సినీ,సిరాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా?.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోందని స్పష్టం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News