Telangana: తెలుగు సినిమాపై పుష్ప ప్రభావం, ఇకపై నో బెనిఫిట్ షో

Telangana: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీపై గట్టి ప్రభావం చూపించింది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2024, 05:47 PM IST
Telangana: తెలుగు సినిమాపై పుష్ప  ప్రభావం, ఇకపై నో బెనిఫిట్ షో

Telangana: అల్లు అర్జున్ పుష్క 2 సినిమా విడుదల-సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం గానీ అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ ఈ అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడీ సినిమా ప్రభావం ఏకంగా మొత్తం తెలుగు సినిమా పరిశ్రమపైనే పడింది. 

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య ధియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఓ మహిళ మరణానికి కారణమైంది. ఆమె కుమారుడు గత 18 రోజులుగా చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్‌పై విడుదల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తప్పందా అల్లు అర్జున్‌దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. సన్ రూఫ్ కారులో అభివాదం చేస్తూ రావడంతో అభిమానులు ఒక్కసారిగా కారువైపుకు వచ్చారని, అదే సమయంలో బౌన్సర్లు అభిమానులకు నెట్టి వేయడంతో రేవతి, ఆమె కుమారుడు కిందకు పడి రేవతి మరణించిందని రేవంత్ రెడ్డి వివరించారు. ఆమె కుమారుడు శ్రీ తేజ్ వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భర్తిస్తుందన్నారు. 

ఇప్పుడీ సినిమా ప్రభావం తెలుగు సినిమా పరిశ్రమపై పడేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ అన్ని సినిమాలు అనుమతులిచ్చామని ఇకపై ఏ హీరో సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఉండదన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సినిమా పరిశ్రమపై తీవ్రంగానే ఉండనుంది. కోట్లాది రూపాయల ఆదాయంపై ప్రభావం పడనుంది. 

Also read: Public Holidays 2025: కొత్త ఏడాదిలో బ్యాంకులు, ఆఫీసులు, విద్యాలయాల సెలవులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News