Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ఇప్పుడు మరి కొద్దిగంటల్లో తీవ్రరూపం దాల్చనుందని ఐఎండీ వెల్లడించింది. వాయుగుండం తీవ్రత పెరిగే కొద్దీ భారీ వర్షాలు విస్తృతం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకు 480 కిలోమీటర్ దూరంలో విశాఖపట్నంకు 430 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృకతమై ఉంది. క్రమంగా ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ 12 గంటలు కొనసాగనుంది. ఈ క్రమంగా మరింత తీవ్రరూపం దాల్చి ఆ తరువాత బలహీనపడే అవకాశాలున్నాయి. అయితే తుపానుగా మారే అవకాశాల్లేవని వాతావరణ శాఖ తెలిపింది. కానీ వాయుగుండం తీవ్రత పెరగడంతో భారీ వర్షాలు తప్పేట్టు లేవని వివరించింది. ఇప్పటికే విశాఖపట్నం, బరంపురం, గోపాల్పూర్, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి.
ఫలితంగా ఇవాళ ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ , రేపు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపట్నించి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
Also read: Public Holidays 2025: కొత్త ఏడాదిలో బ్యాంకులు, ఆఫీసులు, విద్యాలయాల సెలవులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.