Post Office Schemes: పోస్టాఫీసుల్లో చాలా రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని స్కీమ్స్ అయితే బ్యాంకుల కంటే అధిక వడ్డీ అందిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ పధకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. జనవరి 1న వడ్డీ రేట్లు మారనున్నాయి. మీరు కూడా పోస్టాఫీసు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఏ మేరకు ప్రయోజనం కలగనుందో తెలుసుకుందాం.
పోస్టాఫీసుల్లో కూడా బ్యాంకుల్లో ఉన్నట్టే ఎఫ్డి, ఆర్డి, పీపీఎఫ్ వంటి పథకాలతో పాటు ఇతర పథకాలు ఉన్నాయి. ఒక్కో పధకంపై ఒక్కో రకమైన వడ్డీ ఉంటుంది. పోస్టాఫీసు సేవింగ్స్ ఎక్కౌంట్ అయితే 4 శాతం వడ్డీ లభిస్తుంది. అదే 1 ఏడాది డిపాజిట్‌పై 6.9 శాతం, 2 ఏళ్ల డిపాజిట్‌పై 7 శాతం, 3 ఏళ్ల డిపాజిట్‌పై 7.1 శాతం, 5 ఏళ్ల డిపాజిట్ అయితే 7.5 శాతం వడ్డీ అందుతుంది. ఇక ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 6.7 శాతం, సీనియర్ సిటిజన్లుకు 8.2 శాతం, మంత్లీ ఇన్‌కం స్కీమ్‌పై 7.4 శాతం, పీపీఎఫ్‌పై 7.1 శాతం, సుకన్యా సమృద్ధి యోజన పధకంపై 8.2 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందుతుంది.
వీటిలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లాంటివే. ప్రతి భారతీయ పౌరుడు ఇందులో ఐదేళ్లకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్ మరో బెస్ట్ పధకం. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా ఆదాయం వస్తుంది. ఇందులో గరిష్టంగా 9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ ఎక్కౌంట్ అయితే గరిష్టంగా 15 లక్షలు డిపాజిట్ సాధ్యమౌతుంది. ఈ పధకంపై 7.4 వడ్డీ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.