DK Aruna: రేవంత్ అడ్డాలో డీకే అరుణ హల్‌చల్‌.. లగచర్ల రైతులకు పరామర్శ

DK Aruna Visits Lagacharla Village And Meets To Farmers: రేవంత్‌ రెడ్డి అడ్డాలో బీజేపీ ఎంపీ డీకే అరుణ హల్‌చల్‌ చేశారు. ఉద్యమంతో యావత్‌ దేశాన్ని ఆకర్షించిన లగచర్ల రైతులను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 23, 2024, 03:29 PM IST
DK Aruna: రేవంత్ అడ్డాలో డీకే అరుణ హల్‌చల్‌.. లగచర్ల రైతులకు పరామర్శ

Lagacharla Farmers: 'మీకు నేనున్నా రైతులెవరూ భయపడొద్దు' అని లగచర్ల పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ భరోసా ఇచ్చారు. ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. కొడంగల్‌పై రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యేగా ఎంత బాధ్యత ఉందో.. మహబూబ్‌నగర్‌ ఎంపీగా తనకు అంతే బాధ్యత ఉందని వివరించారు. ఈ మారుమూల గ్రామాల్లో ఫార్మా పెడితే ఇక్కడి ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు.

Also Read: CV Anand: అల్లు అర్జున్ అంశంలో విచక్షణ కోల్పోయిన పోలీస్ కమిషనర్.. మీడియా దెబ్బకు క్షమాపణలు

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం లగచర్లతోపాటు పరిసర గ్రామాల ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించి జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయిన రైతులను డీకే అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా లగచర్ల గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం లగచర్ల బాధిత రైతులను పరామర్శించగా.. కలెక్టర్‌ దాడి సంఘటనను రైతులను అడిగి తెలుసుకున్నారు. అరెస్ట్ చేసిన పరిస్థితులు.. పోలీసులు వ్యవహరించిన తీరు ఎంపీ అరుణకు చెప్పుకుని రైతులు కన్నీరు పెట్టుకున్నారు.

Also Read: Tollywood: తెలంగాణకు బై బై! సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనుందా?

'లగచర్ల ఉదంతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. లగచర్లతో పాటి పరిసర తండాలలో భూములు సేకరించి ఫార్మా పెట్టాలని చూశారు. ఆరోజు ఘటన తర్వాత అధర్మంగా రాత్రికి రాత్రి దాడులు చేసి భయపెట్టి అరెస్ట్ చేశారు' అని డీకే అరుణ వివరించారు. ఇలా  ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా? అరెస్టులు  చేసిన మా భూములు ఇవ్వబొమని పట్టుదలతో ఉన్నారని రైతులను అభినందించారు. రైతుల అభిప్రాయాలూ గౌరవించాలని.. భూములు లక్కోవడం సరికాదని స్పష్టం చేశారు. ఫార్మా ఇండస్ట్రీ ముఖ్యం కాదని.. వారు నమ్ముకున్న భూములు ముఖ్యమని గుర్తించాలని రేవంత్‌ రెడ్డికి సూచించారు.

'భూములు ఇవ్వమన రైతులను కొట్టి పీడించిన తీరు సహించ రానిది. ఒక ప్రయివేట్ కంపెనీ కోసం అమాయక రైతులను ఇబ్బందులు ఇబ్బంది పెట్టడం చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ఒక ప్రయివేట్ కంపెనీ కోసం నీకు ఓట్లేసిన గెలిపించిన రైతులను కొట్టిస్తారా?' అంటూ రేవంత్ రెడ్డిపై ఎంపీ అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 57 మందిలో 24 మంది విడుదలవగా.. మరో 15 మందికి కూడా బెయిల్ వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 'లగచర్ల రైతులను కలుస్తానంటే అడ్డుకున్నారు. ఇక్కడి రైతులు.. వారి తరపున పోరాడుతున్న నా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం' అని పేర్కొన్నారు. ఇక్కడికి నేను వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంతా భయమో అర్థం కాలేదని సందేహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News