Allu Arjun: అల్లు అర్జున్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్..!

Allu Arjun Bouncer: సంధ్య థియేటర్ ఘటన ఎప్పటికప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు..ఈ ఘటనకు కారణమైన బౌన్సర్ ఆంటోనీని.. చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 24, 2024, 04:27 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్..!

Allu Arjun Bouncer Arrest: ప్రస్తుతం ఎక్కడ చూసినా సంధ్యా థియేటర్ ఘటన గురించి చర్చిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో చోటు చేసుకున్న కీలక పరిణామం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన బౌన్సర్ ఆంటోనీని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. పలు ఈవెంట్లకు బౌన్సర్ల ఆర్గనైజర్ గా ఆంటోని వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ ఘటనలో థియేటర్ అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. 

డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప 2 సినిమా విడుదల అయ్యింది. అయితే అంతకు ముందు రోజే ఈ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షో ని ప్రదర్శించారు.  ఈ షో చూడడానికి అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి వెళ్లారు. అదే సమయంలో అభిమానులు కూడా అధిక సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. 

ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా..  రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇకపోతే ఈ సంఘటన విషయంపైనే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.

అయితే ఈ ఘటనపై ఆయన మళ్లీ ప్రెస్ మీట్ పెట్టడంతో సీరియస్ అయిన పోలీసులు విచారణకు పిలిచారు. ఈరోజు దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ ని విచారించినట్లు సమాచారం. విచారణలో భాగంగా మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది  అంతేకాదు ఇందులో కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని పోలీసులు చెప్పగా.. అల్లు అర్జున్ కూడా అంగీకరించినట్లు సమాచారం.

Read more: Allu Arjun Police Station: పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ప్రశ్నలతో బన్ని ఉక్కిరి బిక్కిరి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News