Governors Appointments: గవర్నర్ల నియామకాల్లో భారీ మార్పులు జరిగాయి. ఒడిశా గవర్నర్ రాజీనామా చేయగా అతడి రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇక ఆ స్థానంలో మన తెలుగు వ్యక్తి కంభంపాటి హరిబాబును బదిలీ చేశారు. మరికొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో తగువు పెట్టుకున్న వివాదాస్పద గవర్నర్ ఆరిఫ్ అహ్మద్కు స్థాన చలనం కలిగింది. గవర్నర్ల మార్పులు ఇలా ఉన్నాయి. ఇక తీవ్ర అల్లర్లు.. ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌కు అజయ్ కుమార్ భల్లా గవర్నర్‌గా నియమితులు కావడం గమనార్హం.
Also Read: KCR Wishes: క్రీస్తు శాంతి మార్గం అద్భుతం.. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఒడిశా గవర్నర్‌గా రఘుబర్ దాస్ రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్‌ను కేరళ గవర్నర్‌గా బదిలీ చేశారు. కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బిహార్‌కు బదిలీ అయ్యారు. ఆరిఫ్ మహ్మద్ తరచూ వివాదాస్పదంగా మారారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్నారు. ఒకస్థాయిలో కేరళ విద్యార్థి సంఘాలు గవర్నర్ పర్యటనను అడ్డుకున్నారు. దాడి చేసినంత పని చేశారు. ఈ నేపథ్యంలో ఆరిఫ్‌ను కేరళ నుంచి పంపించేసినట్లు చర్చ జరుగుతోంది. మిజోరం గవర్నర్ జనరల్ విజయ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను కల్లోల మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్‌గా పంపారు. మణిపూర్‌లో జరుగుతున్న ఘర్షణలు.. అల్లర్లను నియంత్రించడానికి.. రాష్ట్రంలో శాంతి పరిస్థితులు ఏర్పడేందుకు అజయ్‌ను మణిపూర్‌కు నియమించినట్లు తెలుస్తోంది.
Also Read: KCR Petition: మాజీ సీఎం కేసీఆర్ సంచలనం.. కాళేశ్వరం అంశంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్
గవర్నర్ల మార్పులు ఇవే!
- ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు
- కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్
- మిజోరం గవర్నర్‌గా విజయ్ కుమార్ సింగ్
- బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్
- మణిపుర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.