Ex CM KCR Quash Petition: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతోపాటు ఆయన మేనల్లుడు హరీశ్ రావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేయిస్తుండడంతో వాటికి వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భగా భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేయడంతో వాటిని కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: K Kavitha: 'రేవంత్ రెడ్డి' రివెంజ్, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే 'అల్లు అర్జున్' వివాదం
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని ఓ ప్రైవేటు పిటిషన్ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కేసీఆర్, హరీశ్ రావు సవాల్ చేశారు. తమకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్‌లో కేసీఆర్, హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేయగా.. విచారణకు రావాలని పిలిచినట్లు సమాచారం.
Also Read: CV Anand: అల్లు అర్జున్ అంశంలో విచక్షణ కోల్పోయిన పోలీస్ కమిషనర్.. మీడియా దెబ్బకు క్షమాపణలు
ఇక మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ రేస్ కేసు వెంటాడుతోంది. సీబీఐ కేసు నమోదు చేయగా.. ఈ విషయంలో బెయిల్ పొందిన కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేయడంతో భారీ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో త్వరలో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేసిన అనంతరం కేటీఆర్‌ను ఈడీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇటు కేటీఆర్.. అటు కేసీఆర్, హరీశ్ రావుకు ఇలా కేసులు వెంటాడుతుండడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కవిత జైలుకు వెళ్లివచ్చిన దాని నుంచి గులాబీ పార్టీ కోలుకోలేదు. ఈ క్రమంలో ఈ వ్యవహారం గులాబీ పార్టీలో ఆందోళన రేపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.