యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాములో రాముల’ వీడియో సాంగ్

ఇక నుంచి మీరు దోసె స్టెప్ వేసేయవచ్చు. అల వైకుంఠపురములో మూవీ నుంచి రాములో రాములా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు.

Last Updated : Mar 4, 2020, 08:24 AM IST
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాములో రాముల’ వీడియో సాంగ్

గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంటూ మొదటినుంచీ అల వైకుంఠపురములో సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మూవీ యూనిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన  Ala Vaikunthapurramuloo సినిమా ఇటీవల విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు 

అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డే నటించి మెప్పించింది. మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలోని ‘రాములో రాముల’ వీడియో సాంగ్ వచ్చేసింది. ఇదివరకే విడుదలైన ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో సంచలనంగా మారాయి. తాజాగా ‘రాములో రాముల’ (Ramuloo Ramulaa Video Song) వీడియో సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.

Also Read: ప్రభాస్‌కు ఆ సత్తా ఉంది: ఆకాశానికెత్తేసిన దర్శకుడు 

కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా పాడారు. థమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పాటలు 2020 ఏడాది టాప్ మ్యూజికల్ హిట్ మూవీగా నిలుస్తోంది. తెలంగాణ యాసలో వచ్చిన ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అభిమానులు దోసె స్టెప్ చూసి ఫిదా అయిపోయారు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 

Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News