Ys Jagan Schedule: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన భేటీలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ దాష్టికాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేతలంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు తోడుగా నిలబడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెలాఖారున లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రతి వారం మూడ్రోజులు ఒక పార్లమెట్ నియోజకవర్గంలో విడిది చేస్తానన్నారు. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల్ని కలుసుకుంటానన్నారు. మండల, గ్రామ స్తాయి నుంచి పార్టీ బలోపేతం కావల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదని, చెడిపోయిన మీడియాతో చేస్తున్నామన్నారు. ఈ యుద్ధం చేయాలంటే సోషల్ మీడియాతోనే సాధ్యమన్నారు. అందుకే ప్రతి కార్యకర్త సోషల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబును అడుగడుగునా నిలదీయాలన్నారు.
ప్రతి ఒక్కరికీ ఫోన్ ఓ ఆయుధంగా మారాలన్నారు. అందరూ వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ ఎక్కౌంట్ కలిగి ఉండాలన్నారు. ప్రతి పిల్లవాడు నా 15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించే పరిస్థితి తీసుకురావాలన్నారు. సూపర్ సిక్స్ గురించి నిరంతరం ప్రశ్నించాలన్నారు. వైసీపీ హయాంలో అంటే మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఏపీలో 66 లక్షల 34 వేల పెన్షన్లు ఉంటే ఇప్పుడు ఈ 8 నెలల్లో 62 లక్షల 81 వేలకు పడిపోయిందన్నారు. ఉంటే ఏకంగా 3.53 లక్షల పెన్షన్లు తొలగించేశారన్నారు.
Also read: Ys Jagan: ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క..కార్యకర్తలకు జగన్ భరోసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.