హైదరాబాద్: కరోనా.. ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఒకే ఆందోళన. ఇది మొదటగా 1-3 రోజుల వ్యవధిలో గొంతు నుంచి ఊపిరితిత్తులు, అక్కడ్నుంచి రక్తంలోకి ప్రవేశిస్తుందని, శరీరంపై ప్రభావం (Coronavirus symptoms) చూపగానే మొదట జ్వరం వస్తుందని, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి మూడో రోజు నుంచి కనిపిస్తాయని నిపుణులు తెలిపారు.
Read Also: గుజరాత్‌లో పొలిటికల్ డ్రామా..!!
మూడు నుండి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందని, దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తి, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుందని, కొంతమందిలో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
Also Read: మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
కాగా, ఊపిరితిత్తులకు చేరిన ఇన్‌ఫెక్షన్ రక్తంలోకి ప్రవేశిస్తుందని, ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి అని, ప్రాణాంతకమైన సెప్సిస్ (బ్లడ్ ఇన్‌ఫెక్షన్) ఒక వారం తర్వాత మొదలవుతుందని అన్నారు. మరోవైపు 3 వారాల తర్వాత రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు మూడు వారాలు చికిత్స అందిస్తే కరోనాను జయించడం సులభమే అని, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులు ఉండి వయసు పైబడిన వారికి ఈ వైరస్‌ను ఎదుర్కోవడం కష్టమని నిపుణులు తెలియజేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..