గ్యాస్ బండ భారం తగ్గనుంది. ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున ధరల్లో తగ్గుదల నమోదైంది. చమురు కంపెనీలు గ్యాస్ బండ ధరను 65 రూపాయల మేర తగ్గించాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలో భారీ తగ్గుదల కనిపించింది.
ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిచ్చే తీపి కబురు మోసుకొచ్చాయి చమురు కంపెనీలు. నేటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర 65 రూపాయలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర 744 రూపాయలుగా ఉంది. మంబైలో 714 రూపాయలు వసూలు చేస్తారు. అటు కోల్ కతాలో గ్యాస్ సిలిండర్ ధర 774 రూపాయలకు చేరింది. చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర 761 రూపాయలుగా ఉంది.
మార్చి తొలి వారంలో సబ్సిడీ సిలిండర్ ధర 53 రూపాయలు తగ్గించారు. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గడంతో మరో 65 రూపాయల మేర తగ్గించడం విశేషం. దీంతో సామాన్య ప్రజలకు గ్యాస్ ధర భారం మెల్లమెల్లగా దిగుతోంది.
'కరోనా వైరస్' గురించి మరో భయంకరమైన నిజం..!!
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు .. 2002 నాటి స్థాయికి దిగజారుతున్నాయి. అప్పట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 25 డాలర్లుగా ఉంది. ఇప్పుడు కూడా క్రమంగా క్రూడ్ ఆయిల్ ధర దిగి వస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా ఇప్పుడు లాక్ డౌన్ అమలవుతోంది. దీని వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. మరోవైపు పెట్రో ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..