న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం అన్నిరంగాలపై తీవ్రంగానే ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన 21రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. అయితే కరోనా నేపథ్యంలో రోజుకు ఓ కొత్త విషయం ప్రచారంలోకి వస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ను 30శాతం తగ్గించనున్నారని, 80 ఏళ్ల పైబడిన వారికి మొత్తానికే నిలిపివేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిజనిజాలను బహిర్గతం చేసింది. నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం
విషయం: కరోనా వ్యాప్తి, ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్లో 30శాతం కోత విధించనుంది. 80ఏళ్ల పైబడిన రిటైర్ట్ ఉద్యోగుల పెన్షన్ను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కోహ్లీ అంటే భయమా. స్పందించిన కాస్ట్లీ బౌలర్
Media reports & rumours circulating on social media claiming that the Govt may reduce employees' pension by 30% & terminate it for those above the age of 80, in the context of #COVIDー19, is FAKE.#PIBFactCheck: This claim is #Fake. Government is doing no such thing! pic.twitter.com/y4c0RnUDvW
— PIB Fact Check (@PIBFactCheck) April 9, 2020
వాస్తవం: ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెన్షన్లో కోత విధించడం గానీ, రద్దు చేయడం అనే నిర్ణయాలు తీసుకోలేదని పీఐబీ నిజ నిర్ధారణ కమిటీ ట్విట్టర్లో ఆ వదంతులను ఖండించింది. పెన్షన్ విషయంలో ప్రచారం అవుతున్న కథనాలను నమ్మవద్దని సూచించింది. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
కాగా, ఎంపీల జీతభత్యాలు, ఎంపీలాడ్స్ నిధులలో 30శాతం కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొదలు ఉద్యోగుల పెన్షన్లో 30శాతం కోత, అని 80 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్ను పూర్తిగా నిలిపివేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..