LockDown Extended: ఢిల్లీ నుంచి వారికి స్పెషల్ ఫ్లైట్!

వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. ప్రాణాంతక మహమ్మారి బారిన పడి దేశంలో ఇప్పటికే భారత్‌లో 273 మంది మృతిచెందారు.

Last Updated : Apr 12, 2020, 10:09 AM IST
LockDown Extended: ఢిల్లీ నుంచి వారికి స్పెషల్ ఫ్లైట్!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. ప్రాణాంతక మహమ్మారి బారిన పడి దేశంలో ఇప్పటికే భారత్‌లో 273 మంది మృతిచెందగా, పాజిటీవ్‌ కేసుల సంఖ్య 8356కు చేరుకుందని తెలిసిందే. దీంతో భారత్‌లో ఇక సురక్షితం కాదని భావించి విదేశీయులు తమ సొంత ప్రాంతాలకు పనయమవుతున్నారు. భారత్‌లో మరో 34 మరణాలు, 909 కొత్త కేసులు

ఈ క్రమంలో ఆస్ట్రేలియా హైకమిషన్‌, రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. 444 మంది విదేశీయులను ఆస్ట్రేలియాకు తరలించేందుకు సిమన్‌ క్విన్‌ అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఛార్టర్‌ విమానం టేకాఫ్‌ అయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ విమానం ల్యాండ్‌ అవనుంది. Must Read: పింఛన్‌లో 30% కోత పడనుందా!

కాగా, ఇందులో 430 మంది ఆస్ట్రేలియా పౌరులు ఉండగా, మరో 14 మంది న్యూజిలాండ్‌ వాసులున్నారు. సిమన్‌ క్విన్‌ ఈ విమాన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారని, తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ఆస్ట్రేలియా హైకమిషన్‌ వెల్లడించింది. భారత్‌లో లాక్‌డౌన్‌ మరిన్ని రోజులు ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అధికారులు తమ పౌరులను ఆస్ట్రేలియాకు తరలించడం గమనార్హం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Trending News