Corona Effect: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా..

Corona Positive Cass At Wedding | ఘనంగా పెళ్లి వేడుక జరిపించారు. అయితే నిబంధనలు గాలికొదిలేశారు. ఏకంగా 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.పెళ్లికి హాజరైన వారిలో ఎంత మందికి కరోనా వచ్చిందోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాతో ఒకరు మరణించడం కలకలం రేపుతోంది.

Last Updated : Jun 28, 2020, 11:13 AM IST
Corona Effect: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా..

Corona Positive Cass At Marriage | జైపూర్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్న సామెతను మనం తరచూ వింటుంటాం. అచ్చం అలాంటి సంఘటనే రాజస్థాన్‌ (Rajasthan)లోని భిల్వారా (Bhilwara) లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి సమయంలో వివాహం (Wedding) లో పాల్గొన్న చాలా మందికి ఇప్పుడు ప్రాణాల మీదకొచ్చింది. వరుడితో సహా ఈ వివాహంలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటీవ్‌ (Corona Positive Cases)గా గుర్తించారు. ఒకరు మరణించారు. ఇంకా 58 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ మేరకు  జిల్లా యంత్రాంగం ఆ కుటుంబంపై కేసు నమోదు చేయడమే కాకుండా మూడు రోజుల్లో ఆరు లక్షలకు పైగా జరిమానా చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ సెంటర్‌కు నామకరణం

నిబంధనలు పాటించకుండా..
భిల్వారా నగరంలోని భదాడా మొహల్లాలో గిసులాల్ రఠి కుమారుడు రిజుల్ వివాహం జూన్ 13 న జరిగింది. వివాహానికి కేవలం 50 మందినే  పిలవాలన్న షరతులతో  అధికారులు కుటుంబానికి అనుమతిచ్చారు. కానీ వివాహానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పైగా ఎలాంటి కరోనా నిబంధనలు పాటించలేదు. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

ప్రభుత్వ ఖర్చులన్నీ చెల్లించాలని..
ఈ వివాహంతో సాధారణ ప్రజల ప్రాణాలకు హాని కలిగించినందుకు విపత్తు నిర్వహణ చట్టం (National Disaster Management Act) సెక్షన్ 51 కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర భట్ తెలిపారు. జూన్ 19 న కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని, ఇంకా ఎక్కువ మంది వ్యాధి బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. వీరికి చికిత్స, ఆహారం, తదితర సౌకర్యాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ .6,26,000 ఖర్చయిందని, ఈ మొత్తాన్ని జరిమానాగా విధించినట్లు పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News