రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తెరకెక్కిస్తోన్న “మర్డర్” ( Murder RGV Movie ) చిత్రంపై ప్రణయ్ తండ్రి బాలాస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీ నిర్మించబోయే ఈ సినిమా వల్ల తన కుమారుడి హత్య కేసు ప్రభావితం అవుతుంది అని.. కోర్డులో ఉన్న కేసుపై ( Pranay Amrutha Case ) సినిమా తీస్తే అది సాక్షులు, బాధితులపై ప్రభావం చూపుతుంది అని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటీషన్ వేశారు. ప్రణయ్ హత్యకేసు ( Pranay Murder Case ) మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఈ హత్యపై చర్చలు జరిగాయి. ప్రణయ్ హత్య కేసు కోర్టులో ఉండగా ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఈ ఉదాంతంపై ఒక సినిమా తీస్తానంటూ ప్రకటించాడు. మర్డర్- కుటుంబ కథా చిత్రం ( Murder Kutumba Katha Chitram ) అంటూ ఫాదర్స్ డే రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. అమృత -ప్రణయ్‌ల ప్రేమ కథ ( Pranay -Amrutha Love Story ) ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. Also Read :Golden Mask: బంగారు మాస్క్‌తో హల్‌చల్ చేస్తోన్న పూణే గోల్డ్ మ్యాన్
MURDER is “మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ" #LoveCanMURDER pic.twitter.com/NEfVZp6NRJ
— Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020
దీంతో ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. బాలాస్వామి ( Pranay Father Balaswamy ) వేసిన పిటీషన్‌పై కోర్టు స్పందించింది. బాలాస్వామీ అందించిన సాక్ష్యాల ఆధారంగా ఆర్జీవి ( RGV ) పై కేసు నమోదు చేయమని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..