Golden Mask: బంగారు మాస్క్‌తో హల్‌చల్ చేస్తోన్న పూణే గోల్డ్ మ్యాన్

కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమించకుండా ఉండటానికి భౌతిక దూరం ( Social Distance )తో  పాటు మాస్క్‌లు  తప్పకుండా ధరించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో  అందుబాటులోకి వస్తున్నాయి. 

Last Updated : Jul 4, 2020, 05:46 PM IST
Golden Mask: బంగారు మాస్క్‌తో హల్‌చల్ చేస్తోన్న పూణే గోల్డ్ మ్యాన్

కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమించకుండా ఉండటానికి భౌతిక దూరం ( Social Distance ) తో  పాటు మాస్క్‌లు  తప్పకుండా ధరించాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో  అందుబాటులోకి వస్తున్నాయి. పూణెేకు చెందిన ఒక వ్యక్తి మాత్రం సొంతంగా బంగారంతో మాస్క్‌ డిజైన్ చేయించి ధరిస్తున్నాడు. స్వతహాగా బంగారాన్ని ఇష్టపడే శంకర్ కురడే ( Shankar Kurade )  సుమారు 2 లక్షల 90 వేలతో సొంతంగా మాస్కు తయారు చేయించాడు. గోల్డెన్ మాస్క్ కోసం శంకర్ కురడే ( Shakar Kurade Golden Mask ) సుమారు ఐదు తులాల బంగారాన్ని వినియోగించాడు.

Also Read : IRCTC Rajdhani Express: Timing: రాజధాని రైళ్ల టైమింగ్‌లో మార్పు..కొత్త టైమ్ టేబుల్ ఇదే

బంగారు మాస్క్ బాగా మందంగా ఉంటుంది అని ఎన్ 95 (N95 Mask ) మాస్క్‌లా దీనికి చిన్న రంద్రాలు ఉన్నాయి అని తెలిపాడు శంకర్. ఈ మాస్క్ వినియోగించిన తరువాత శుభ్రపరుస్తానని...శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని పేర్కొన్నాడు. అయితే బంగారు మాస్క్ ( Golden Mask ) వల్ల కరోనావైరస్ నుంచి రక్షణ కలుగుతుందోొ లేదో అనే విషయం గురించి తెలియదని వివరించాడు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News