Vizag: ఫార్మా సిటీలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన విశాఖ

Vizag fire accident: విశాఖపట్నం : విశాఖలోని పారిశ్రామికవాడల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌లో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన మరవక ముందే తాజాగా పరవాడ ఫార్మా సిటీలో ( Parawada pharma city ) సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Last Updated : Jul 14, 2020, 01:54 AM IST
Vizag: ఫార్మా సిటీలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన విశాఖ

Vizag fire accident: విశాఖపట్నం : విశాఖలోని పారిశ్రామికవాడల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటన ఇంకా మరవక ముందే తాజాగా పరవాడ ఫార్మా సిటీలో ( Parawada pharma city ) సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పరవాడ ఫార్మా సిటీలో ఉన్న రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్ కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో ( Reactor blasted ) ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ( Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం )

ఊహించని పరిణామానికి భయాందోళనకు గురైన స్థానికులు, సిబ్బంది.. పరిశ్రమకు దూరంగా పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ.. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో మంటల్ని అదుపు చేయడం వారికి కష్టంగా మారింది. అయినప్పటికీ.. అగ్నిమాపక శాఖ సిబ్బంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన సిబ్బందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.  ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలోని వివిధ పరిశ్రమల్లో మందులు తయారీ అనంతరం వెలువడే వృథాను ఇక్కడి సిబ్బంది తిరిగి శుభ్రపరిచే ( refinery process ) ప్రక్రియలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

( Also read: COVID-19: ఆస్పత్రి నుంచి తప్పించుకున్న కరోనా పేషెంట్ )

Trending News