Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనావైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 

Last Updated : Jul 18, 2020, 05:06 PM IST
Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా

AP Corona Cases: అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనావైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఏపీలో గత 24 గంటల్లో 3,963 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 44,609కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 52 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 589కి చేరింది. Also read: COVID-19 patient: క్వారంటైన్ సెంటర్‌లో మహిళపై అత్యాచారం

ఏపీ ప్రభుత్వం ( AP Govt ) శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. ఇప్పటివరకు 21,763 మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 22,260 మంది రాష్ట్రంలోని పలు ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్‌లల్లో చికిత్స పొందుతున్నారు. ( Also read: IIT admissions: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీల్లో ప్రవేశానికి తొలగిన అడ్డంకి )

అయితే గత 24 గంటల్లో 23,872 శాంపిళ్లను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,84,384 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే కరోనా కారణంగా గత 24గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాల్లో 12 మంది మరణించగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. 
జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు.. 

Ap corona cases bulletin

Trending News