భారత్‌లో కరోనా కేసుల (India COVID19 positive cases) తీవ్రత తారా స్థాయికి చేరుతోంది. దేశంలో తొలి లక్ష కేసులకు 109 రోజులు పట్టగా, తర్వాత 9 లక్షల కేసులు కేవలం రెండు నెలల వ్యవధిలోనే నమోదు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. ముఖ్యంగా జులై నెలలో మూడు రోజుల్లోనే లక్ష కరోనా కేసులు (CoronaVirus Cases In India) నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47,148 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏకంగా 587 మంది మంది మరణించారు. తాజా కేసులతో కలిపితే ఇప్పటివరకూ భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Positive cases)11,55,191కి చేరింది. Covid19: బ్రెజిల్‌లో కరోనా వైరస్ బీభత్సం
మరోవైపు కరోనా మరణాల సంఖ్య 28 వేలు దాటిపోయింది. తాజాగా నమోదైన మరణాలతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనాతో 28,084 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు జులై 21న ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కేసులకుగానూ 7,24,087 డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 4,02,529 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తెలంగాణ సర్కార్ ప్రత్యేక కరోనా యాప్
దేశంలో ఇప్పటివరకూ 1,43,81,303 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. అందులో జులై 20న ఒక్కరోజే 3,33,395 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
India: దేశంలో 4,02,529 యాక్టివ్ కరోనా కేసులు