అమరావతి: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ (COVID-19) అని తేలడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తన ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆందోళన చెందుతున్న వారికి సమాధానం చెబుతూ అంబటి రాంబాబు ( Ambati Rambabu ) నేరుగా ఓ వీడియో విడుదల చేశారు. ఇవాళ ఉదయం చేసిన కొవిడ్-19 పరీక్షల్లో తనకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) అని తేలిందని అంబటి రాంబాబు నిర్థారించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుకునేందుకు భారీ సంఖ్యలో పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఫోన్స్ చేస్తున్నారని.. కానీ అందరికీ సమాధానం చెప్పడం కుదరడం లేదని అంబటి రాంబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం ( Ambati Rambabu's health status ) గురించి ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. తాను ఆస్పత్రిలో చేరి చికిత్స ( COVID-19 treatment ) తీసుకోదల్చుకుంటున్నందున దయచేసి ఎవ్వరూ ఫోన్ చేయకూడదని తన వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ( Isolation ) ఉన్నానని చెప్పిన అంబటి.. తాను ధైర్యంతో ఉన్నానని.. తిరిగి ఆరోగ్యంగా బయటికి వస్తానని ధీమా వ్యక్తంచేశారు. ( Also read: Rajinikanth: ఆ యూట్యూబ్ ఛానెల్‌పై సర్కార్ చర్యలు )
కరోనా బారిన పడిన అంబటి రాంబాబు
ఆసుపత్రిలో చికిత్స చేయించుకొనేందుకు ప్రయత్నిస్తున్నానన్న అంబటి #coronavirus #Covid_19 @AmbatiRambabu pic.twitter.com/kow62vmc8t
— Zee Hindustan Telugu (@ZeeHTelugu) July 22, 2020
ఇదిలావుంటే, వైసిపి అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) సైతం ముందు జాగ్రత్త చర్యగా తాను వారం, పది రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటానని.. అత్యవసరం అయితే తప్ప ఫోన్ కాల్స్‌కి అందుబాటులో ఉండనని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
In view of the Covid situation I have decided to quarantine myself for a week to ten days as a mark of abundant caution.I will not be available on telephone except for emergencies.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2020