ఇండియన్ రైల్వేలో.. 11 లక్షల మంది దొంగలు

2016 సంవత్సరానికి సంబంధించి దేశం మొత్తం కలిపి... అన్ని రైల్వేస్టేషన్లలో జరిగిన దొంగతనాలపై ఒక  రిపోర్టు తయారు చేయగా.. దాదాపు 11 లక్షల మంది దొంగలను ఆయా సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తేలింది.

Last Updated : Dec 8, 2017, 05:58 PM IST
 ఇండియన్ రైల్వేలో.. 11 లక్షల మంది దొంగలు

భారతీయ రైల్వే అధికారులు ఇటీవలే విడుదల చేసిన సర్వే రిపోర్టులో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. 2016 సంవత్సరానికి సంబంధించి దేశం మొత్తం కలిపి... అన్ని రైల్వేస్టేషన్లలో జరిగిన దొంగతనాలపై ఒక  రిపోర్టు తయారు చేయగా.. దాదాపు 11 లక్షల మంది దొంగలను ఆయా సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తేలింది.

ప్రయాణికుల టవళ్లు, దుప్పట్లు దొంగతనం చేసే చిన్నాచితకా దొంగల నుండి.. బోగీల్లో వాష్ బేసిన్లు, ట్యూబ్ లైట్లు, అద్దాలు సైతం పీక్కుపోయే చిత్రమైన దొంగలు.. ప్రయాణికుల పర్సులు, బ్యాగులు కాజేసే బడా దొంగల వరకు.. ఇలా అందరి డేటా సేకరించాక విస్తుపోవడం రైల్వేశాఖ వంతైంది. 2016లో ఇండియన్ రైల్వే దేశం మొత్తం కలిపి 11 లక్షల మంది దొంగలను అరెస్టు చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయి.

దీనిబట్టి, రైల్వేలో రోజు రోజుకూ నేరాల శాతం విపరీతంగా పెరిగిపోతుందని.. రైల్వేస్టేషన్లలో దొంగతనాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారట రైల్వే అధికారులు. ఈ జాబితా ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా 2.23 లక్షల మంది దొంగలను అరెస్టు చేశారట పోలీసులు. దీని తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. 

Trending News