హైదరాబాద్: బక్రీద్ పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ( TS Wakf Board) ఓ కీలక ప్రకటన చేసింది. కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈసారి బక్రీద్ పర్వదినం నాడు రాష్ట్రంలోని ఈద్గాలలో ఈద్-ఉల్-అధా ప్రార్థనలు ( Bakrid prayers) అనుమతించడం లేదని వక్ఫ్ బోర్డు స్పష్టంచేసింది. ముస్లిం సోదరులు ఈద్గాలకు వెళ్లకుండా తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేసింది. Also read: COVID-19 in AP: 24 గంటల్లో 68 మంది మృతి
బక్రీద్ నాడు మసీదులు తెరిచే ఉంటాయని చెప్పిన వక్ఫ్ బోర్డు.. మసీదుల్లో ప్రార్థనకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్య 50కి మించకుండా చూసుకోవాలని తమ మార్గదర్శకాల్లో పేర్కొంది. అంత కంటే అధిక సంఖ్యలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రార్థనలకు అనుమతించరాదని.. సంప్రదాయం ప్రకారం అలయ్ బలయ్ ఇచ్చుకోకుండా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని వక్ఫ్ బోర్డు తేల్చిచెప్పింది. Also read: Kollu Ravindra: కొల్లు రవీంద్రకు కోర్టులో చుక్కెదురు