IPL ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నిర్వహణ ఐపీఎల్ పాలక మండలికి, బీసీసీఐకి కత్తిమీద సాములాగ తయారైంది. ఐపీఎల్ సీజన్ 13ను విదేశాల్లో నిర్వహించనుండటమే అందుకు ప్రధాన కారణం.

Last Updated : Aug 6, 2020, 04:20 PM IST
  • కత్తిమీద సాములాగ మారిన ఐపీఎల్ నిర్వహణ
  • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు BCCI కీలక ఆదేశాలు
  • ఆటగాళ్ల సేఫ్టీనే ముఖ్యమని బీసీసీఐ స్పష్టం
  • ఆటగాళ్ల భద్రతపై యోచిస్తున్న ఫ్రాంచైజీలు
IPL ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నిర్వహణ ఐపీఎల్ పాలక మండలికి, బీసీసీఐకి కత్తిమీద సాములాగ తయారైంది. ఐపీఎల్ సీజన్ 13ను విదేశాల్లో నిర్వహించనుండటమే అందుకు ప్రధాన కారణం. కరోనా లేకపోతే ఓకే కానీ ఈ పరిస్థితుల్లో క్రికెటర్ల ఆరోగ్యం, వారి కుటుంబసభ్యలు సెఫ్టీ సైతం ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించడం కష్టతరమైన విషయం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటగాళ్ల సేఫ్టీనే తమకు ముఖ్యమని 8 ఐపీఎల్ ఫ్రాంచైజీల (BCCI Guidelines to IPL Franchises)కు పదే పదే సూచించినట్లు సమాచారం. Rohit Sharma: ముంబై జట్టులో రోహిత్‌కు అతి తక్కువ ప్రాధాన్యం

53 రోజులపాటు 60 మ్యాచ్‌లు జరగనున్న ఐపీఎల్ 2020లో ఆఖరి బంతి పడేవరకు, అనంతరం ఆటగాళ్లు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేంత వరకు ఫ్రాంచైజీలకు పూర్తిస్థాయి బాధ్యత అని సూచించింది. ఆటగాలళ్ల కుటుంబాలను అనుమతిస్తారా.. లేదా అనేది పూర్తిగా ఫ్రాంచైజీల ఇష్టమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే బయో బబుల్ పద్ధతిలో పూర్తి స్థాయిలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని కాపాడాలని కొన్ని పేజీల డాక్యుమెంట్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపినట్లు తెలుస్తోంది. MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువరాజ్ సింగ్

ఆగస్టు 20 తర్వాత క్రికెటర్లు యూఏఈకి వెళ్లనున్నారు. అప్పటిలోగా పూర్తిస్థాయిలో ఐపీఎల్ నిర్వహణ, పలు అంశాలపై చర్చించుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. గతంలో మాదిరిగా కాకుండా ఒక్కో జట్టును ఒక్కో హోటల్‌లో బస చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ప్రతి 5 రోజులకు ఒకసారి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యతను సైతం అప్పగించింది. ముఖ్యంగా టోర్నీ ముగిసేవరకూ బయటి వ్యక్తులను ఆటగాళ్ల వద్దకు అనుమతించకూండా చూసుకోవాలని పేర్కొంది. IPL 2020: ఎంఎస్ ధోనీ చెన్నై టీమ్ రె‘ఢీ’.. 
 
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

Trending News