టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati Wedding) పెళ్లి పనులు మొదలయ్యాయి. దగ్గుబాటి ఫ్యామిలీ రానా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ప్రేమ జంట దగ్గుబాటి రానా - మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్టు 8న జరగనుందని తెలిసిందే. వధువు మిహికా (Miheeka Bajaj) ఇంట్లోనూ పెళ్లి సందడి కనిపిస్తోంది. పెళ్లి పనులు చకా చకా జరిగిపోతున్నాయని రానా, మిహికా సన్నిహితులు చెబుతున్నారు. పెళ్లి వేడుకలలో భాగంగా మిహికా ఇంట్లో గురువారం ‘హల్దీ ఫంక్షన్’ ( Haldi Ceremony at Miheeka Bajaj Home) నిర్వహించారు. COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. చివరి దశలో ప్రాణాలకే ముప్పు
పసుపు రంగు డిజైనర్ లెహంగా, సముద్రపు గవ్వల జ్యువెలరీలో మిహికా తళుక్కున మెరిశారు. ఈ సందర్భంగా రానా, మిహికాల ఫొటోషూట్ సెషన్ చేశారు. హల్దీ ఫంక్షన్లో రానా, మిహికాలు సందడి చేశారు. అయితే కరోనా నేపథ్యంలో రానా – మిహికా వివాహాన్ని కేవలం కొందరు అతిథుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరపనున్నట్లు నిర్మాత సురేష్ బాబు తెలిపారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
రానా, మిహికా వివాహానికి హాజరు కావాలంటే కోవిడ్19 టెస్టులు చేయించుకుని రావాలని అతిథులకు చెప్పడం విశేషం. కరోనా నేపథ్యంలో ఆ మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. శనివారం రాత్రి వివాహం నేపథ్యంలో పెళ్లి వేదికతో పాటు పరిసరాలను మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. భౌతికదూరం పాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి పని చేస్తున్నట్లు వర్కర్లకు ముందుగానే కోవిడ్19 టెస్టులు చేసినట్లు సమాచారం. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి
‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ హాట్ హాట్‌గా..