పొట్టచేతపట్టుకుని మాతృదేశానికి వలస వచ్చారు. 8 ఏళ్ల క్రితం పాకిస్తాన్( Pakistan ) నుంచి వచ్చిన హిందూ శరణార్ది కుటుంబం (Hindu Refugee family ). ఏమైందో ఏమిటో...ఏకంగా 11 మంది కుటుంబసభ్యులు విగతజీవులై కన్పించారు. రాజస్థాన్ జోధ్ పూర్ ( Rajasthan Jodhpur ) లో జరిగిన సంఘటన కలకలం రేపుతోంది.
రాజస్థాన్ లో మహా విషాదం చోటుచేసుకుంది. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్ధి కుటుంబంలో ( Refugee camp ) ఏకంగా 11 మంది మరణించి కన్పించడం కలకలం రేపుతోంది. జోధ్ పూర్ లోని ఆ శరణార్ధుల ఇంట్లోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఘటనా ప్రాంతం నుంచి పురుగుల మందు వాసన, విషవాయువులు రావడంతో...ఈ ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సామూహిక ఆత్మహత్య ( Family suicide ) చేసుకుని ఉండవచ్చని కూడా స్థానికులు చెబుతున్నారు. జోధ్ పూర్ ( Jodhpur ) జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో..దియోదు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. భారత దేశ పౌరసత్వం కోసం 2012లో ఈ కుటుంబం పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతం నుంచి వలస వచ్చింది. అప్పట్నించి శరణార్ధి శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇంతమంది ఎలా మరణించారనే కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ఓ కుటుంబసభ్యుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికులు తెలిపారు. Also read: Atom Bomb: మహా ఉత్పాతానికి 75 ఏళ్లు..నేటికీ జీవచ్ఛవాలుగా జనం