Delhi Metro: ఆగస్టు నుంచి జీతభత్యాల్లో 50 శాతం కోత

కరోనా వైరస్ ( Corona virus ) సెగ ఇప్పుడు ఢిల్లీ మెట్రోను కూడా తాకింది. మెట్రో సర్వీసులు ( Metro Services ) నడవని కారణంగా ఉద్యోగుల జీతాల్లో భారీకోత విధించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ () Delhi metro rail corporation ) నిర్ణయం తీసుకుంది.

Last Updated : Aug 18, 2020, 10:49 PM IST
Delhi Metro: ఆగస్టు నుంచి జీతభత్యాల్లో 50 శాతం కోత

కరోనా వైరస్ ( Corona virus ) సెగ ఇప్పుడు ఢిల్లీ మెట్రోను కూడా తాకింది. మెట్రో సర్వీసులు ( Metro Services ) నడవని కారణంగా ఉద్యోగుల జీతాల్లో భారీకోత విధించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ () Delhi metro rail corporation ) నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఢిల్లీలో మార్చ్ నెల నుంచి మెట్రో సేవలు ( Metro services ) పూర్తిగా నిలిచిపోయాయి. అయితే సంస్థ ఉద్యోగులకు జీతాలు మాత్రం ఇప్పటివరకూ ఆగలేదు. ఇప్పుడిక జీతాలు కట్ చేసేందుకు ఢిల్లీ మెట్రో నిర్ణయించింది.  జీతభత్యాల్ని 50 శాతం తగ్గించనున్నట్టు ఢిల్లీ మెట్రో ప్రకటించింది. ఆగస్టు నెల జీతం నుంచే ఈ కోత ప్రారంభం కానుంది.

మరోవైపు ఇంటి నిర్మాణ అడ్వాన్స్, ఇతర అడ్వాన్స్ , ల్యాప్ టాప్ అడ్వాన్స్ , పండుగ అడ్వాన్స్ వంటివాటిని తక్షణం అంటే ఇప్పట్నించే పెండింగ్ లో పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆమోదం పొందిన అడ్వాన్స్ లు మాత్రం చెల్లించనున్నారు. Also read: Kerala: కేరళ బుడతడి మ్యూజిక్ మ్యాజిక్ హ్యాట్సాఫ్ అనాల్సిందే

Trending News