COVID-19 vaccine clinical trials in Vizag విశాఖ: కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఆంధ్రా మెడికల్ కాలేజీ ( AMC ), కింగ్ జార్జ్ హాస్పిటల్స్ ( KGH )లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు డీఎంఈ నుంచి కూడా అనుమతి లభించడంతో డీఆర్డీవో పర్యవేక్షణలో నివాస్ లైఫ్ సైన్సెస్, ఐసీఎంఆర్ పర్యవేక్షణలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ట్రయల్స్, ఆంధ్ర మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో కేజీహెచ్‌లో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించనున్నారు. కరోనావైరస్కి చెక్ పెట్టడానికి జరుగుతున్న కృషిలో ఇదో ముందడుగుగా కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలు భావిస్తున్నాయి. Also read : COVID-19: ఏపీలో 3000 దాటిన కరోనా మృతుల సంఖ్య
ఇదిలావుంటే, ఏపీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. గురువారం ఉదయం వరకు ఏపీలో మొత్తం 30,74,847 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 3,25,396 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇప్పటివరకు మొత్తం 3001 మంది కరోనాతో చనిపోయారు. Also read : SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్య పరిస్థితి