Nuclear War: భారత్‌పై అణుబాంబులతో దాడి: పాక్ మంత్రి

భారత్ మీద దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారతదేశం మీద అణు బాంబులతో దాడి చేస్తామంటూ ఆ దేశ మంత్రి షేర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు (Sheikh Rasheed)  చేశారు. బాంబుల తయారీ మొదలుపెట్టినట్లు చెప్పారు.

Last Updated : Aug 21, 2020, 08:37 AM IST
Nuclear War: భారత్‌పై అణుబాంబులతో దాడి: పాక్ మంత్రి

ఇస్లా‌మా‌బాద్‌: భార‌త్‌పై అణు‌బాం‌బు‌లతో దాడి‌చే‌స్తా‌మని పాకి‌స్తాన్ (Pakistan) కేంద్ర రైల్వే‌శాఖ మంత్రి షేక్‌ ‌ర‌షీద్ (Sheikh Rasheed)‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం చెప్పారు. భారత సైన్యంతో పోల్చితే పాక్ సైన్యం అంత స్ట్రాంగ్ కాదని, అందుకే భారత్‌తో యుద్ధం తలెత్తితే అణుబాంబులతో దాడి చేస్తామన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న అణు బాంబుల తయారీపై పని మొదలుపెట్టినట్లు తెలిపారు.  . ‘భారత సైన్యంతో పోల్చితే పాక్‌ సైన్యం వెను‌క‌బడి ఉన్నది. Gold Price India: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

భారత్‌పై అణుబాంబులు వేసినా ఇక్కడి ముస్లింలను కచ్చితంగా కాపాడి తీరుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై తన ఆగ్రహం వెల్లగక్కుతూ ప్రసంగం చేసిన అనంతరం షేక్ రషీద్ ఈ తరహా వ్యాఖ్యలు తొలిసారి చేశారు. భారత్‌పై యుద్ధం కోసం అణుబాంబులను తయారుచేస్తామని, నిర్దేశిత లక్ష్యంలో అవి విధ్వంసం చేస్తాయన్నారు. 125 నుంచి 250 గ్రాముల బరువుండే అణు బాంబులు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

‘షేక్ రషీద్ మరొకటి కనిపెట్టారు. భారత్ మీద దాడి చేసేందుకు కఫిర్ బాంబు తయారుచేసే శాస్త్రవేత్తను కనిపెట్టాడంటూ’ జర్నలిస్ట్ నలియా ఇనాయత్ ఓ వీడియో ట్వీట్ చేశారు.   Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos

Trending News