Ishant Sharma reacts after getting Arjuna Award: న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక 'అర్జున' అవార్డుకు ఎంపిక చేయడం పట్ల టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ ( Ishant Sharma) సంతోషం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలంగా లంబూ అభివర్ణించాడు. అయితే.. అర్జున అవార్డులు ప్రకటించిన తరువాత సోమవారం ఇషాంత్ శర్మ మాట్లాడిన వీడియోను బీసీసీఐ ( BCCI ) తన అధికారిక ట్విట్టర్లో పంచుకుంది. అర్జున అవార్డు (Arjuna Award) తనను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉందని.. తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలమని పేర్కొన్నాడు. అవార్డు దక్కడం పట్ల తనతోపాటు.. తన కుటుంబం గర్విస్తోందని ఇషాంత్ పేర్కొన్నాడు. భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టులో ఉన్న తన భార్య ప్రతిమ తనకంటే ఎక్కువగా సంతోషపడిందని ఆనందం వ్యక్తంచేశాడు. Also read: IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్
'A proud moment for me and my family,' @ImIshant on winning the Arjuna Award for 2020.#TeamIndia pic.twitter.com/VbVdWN0qWE
— BCCI (@BCCI) August 24, 2020
అయితే భారత ప్రభుత్వం మొత్తం ముగ్గురిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. ఇషాంత్ శర్మతోపాటు దీప్తీ శర్మ (క్రికెట్) చిరాగ్ శెట్టి (బాడ్మింటన్) ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇషాంత్ శర్మ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. Also read: Disha Patani: అందాలతో కనులవిందు చేస్తున్న దిశా పటానీ